
ఫైజల్‌కు తెలంగాణ కేసరి టైటిల్
ఎల్బీ స్టేడియం: బాబయ్య వస్తాద్ స్మారక తెలంగాణ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఓపెన్ కేటగిరీ (82 -120 కేజీలు) టైటిల్‌ను...
ఎల్బీ స్టేడియం: బాబయ్య వస్తాద్ స్మారక తెలంగాణ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఓపెన్ కేటగిరీ (82 -120 కేజీలు) టైటిల్‌ను సయ్యద్ అబ్దుల్ ఫైజల్ (జై భవాని వ్యాయామశాల) చేజిక్కించుకున్నాడు. బాలకేసరి టైటిల్‌ను టి.దేవిసింగ్ (లాలా తాలీమ్) గెలుచుకున్నాడు. టి.కిషన్ సింగ్ (రహీం పురా పీజీ)కు రెండో స్థానం లభించింది. ఎల్బీ ఇం డోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఓపెన్ కేటగిరీ ఫైనల్లో ఫైజల్ 5-3 స్కోరుతో జాఫర్ బిన్ ముబారక్‌పై విజయం సాధించాడు. హబీబ్ ఖాన్ (బాబామ్ అకాడమీ)కు మూడో స్థానం దక్కింది.
తెలంగాణ కేసరి నిర్వహిస్తాం: నాయిని
రెజ్లింగ్ పోటీల్లో తెలంగాణ యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో మాట్లాడి త్వరలోనే తెలంగాణ కేసరి పోటీలను భారీ ఎత్తున నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు జాఫర్, తెలంగాణ ఇండియున్ స్టయిల్ రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు విజయకుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.