రూనీని వెనక్కునెట్టిన సునీల్‌ చెత్రి | Sakshi
Sakshi News home page

రూనీని వెనక్కునెట్టిన సునీల్‌ చెత్రి

Published Fri, Jun 16 2017 11:48 PM

రూనీని వెనక్కునెట్టిన సునీల్‌ చెత్రి

కెరీర్‌లో 54వ గోల్‌ నమోదు

న్యూఢిల్లీ: బెంగళూరులో జరుగుతున్న ఎఎఫ్‌సీ ఆసియా కప్‌ క్వాలిఫయర్స్‌లో భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ చెత్రీ మరో ఘనత సాధించాడు. బుధవారం కిర్గిజిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్‌ చేసిన సునీల్‌ తన కెరీర్‌లో 54వ గోల్‌ నమోదు చేశాడు. తద్వారా ఇంగ్లండ్, మాంచెస్టర్‌ల ఆటగాడు వేనీ రూనీ(53)ని వెనక్కునెట్టి ప్రస్తుతం ప్రపంచంలో చురుకుగా ఉన్న ఆటగాళ్లలో అత్యధిక గోల్స్‌ సాధించిన నాలుగో ప్లేయర్‌గా సునీల్‌ నిలిచాడు.

బెంగళూరు ఫుట్‌బాల్‌ క్లబ్‌ తరఫున సునీల్‌ ప్రాతినిథ్యం వహిస్తాడు. స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ (58) , క్లిన్ట్‌ డెంప్సే (56) గోల్స్‌తో సునీల్‌ కన్నా  ముందున్నారు. మొత్తం 73 గోల్స్‌తో సాకర్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తొలి స్థానంలో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement