నెట్‌బాల్ విజేత హైదరాబాద్ | state level junnior netball championship hyderabad team won | Sakshi
Sakshi News home page

నెట్‌బాల్ విజేత హైదరాబాద్

Oct 12 2013 12:22 AM | Updated on Sep 1 2017 11:34 PM

రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బాలుర జట్టు సత్తా చాటింది. శామీర్‌పేట్‌లోని మినీ స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్‌లో నగరానికి చెందిన బాలుర జట్టు విజేతగా నిలిచింది.

శామీర్‌పేట్ రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బాలుర జట్టు సత్తా చాటింది. శామీర్‌పేట్‌లోని మినీ స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్‌లో నగరానికి చెందిన బాలుర జట్టు విజేతగా నిలిచింది. ఖమ్మం జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. వరంగల్, కృష్ణా జిల్లా జట్లు సంయుక్తంగా మూడోస్థానం పొందాయి. బాలికల విభాగంలో ఖమ్మం చాంపియన్‌షిప్ సాధించగా, రంగారెడ్డి జట్టు రన్నరప్‌గా నిలిచింది. మెదక్, కృష్ణా జిల్లా జట్లు ఉమ్మడిగా తృతీయ స్థానం పొందాయి. ఈ టోర్నమెంట్‌లో 17 జిల్లాలకు చెందిన జట్లు పాల్గొన్నాయి.

అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి మేడ్చల్ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు తీగల కృపాకర్ రెడ్డి, రాష్ట్ర ఒలింపిక్ సంఘం కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్, స్థానిక సర్పంచ్ కిశోర్ యాదవ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మనోరంజిత, టోర్నమెంట్ కన్వీనర్ వి.దానయ్య తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement