'సచిన్.. కాంగ్రెస్, బీజేపీతో జాగ్రత్త, మా పార్టీలో చేరండి' | Sachin Tendulkar offered to join Samajwadi Party | Sakshi
Sakshi News home page

'సచిన్.. కాంగ్రెస్, బీజేపీతో జాగ్రత్త, మా పార్టీలో చేరండి'

Nov 17 2013 12:38 PM | Updated on Sep 17 2018 5:10 PM

'సచిన్.. కాంగ్రెస్, బీజేపీతో జాగ్రత్త, మా పార్టీలో చేరండి' - Sakshi

'సచిన్.. కాంగ్రెస్, బీజేపీతో జాగ్రత్త, మా పార్టీలో చేరండి'

బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్కు కెరీర్కు గుడ్ బై చెప్పిన మరుసటి రోజే ఊహించని ఆహ్వానం వచ్చింది.

బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్కు కెరీర్కు గుడ్ బై చెప్పిన మరుసటి రోజే ఊహించని ఆహ్వానం వచ్చింది. సమాజ్ వాదీ పార్టీలో చేరాలని సచిన్ను ఉత్తరప్రదేశ్ క్రీడల మంత్రి నరద్ రాయ్ కోరారు. కాంగ్రెస్, బీజేపీలది వాడుకుని వదిలిసే విధానమని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన మాస్టర్కు సూచించారు.

సచిన్ రాజకీయాల్లోకి రావాలని భావిస్తే సమాజ్వాదీ పార్టీలో చేరాలని కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. మాస్టర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడాన్ని నరద్ స్వాగతించారు. ముంబైలో చరిత్రాత్మక 200వ టెస్టు ఆడిన సచిన్ శనివారం వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇదే రోజు మాస్టర్కు దేశ అత్యున్నత పౌరపురస్కారం ప్రదానం చేయనున్నట్టు రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. సచిన్ను ఇదివరకే రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement