ఓపెన్ చెస్ చాంప్ కృష్ణ | open chess champion krishna | Sakshi
Sakshi News home page

ఓపెన్ చెస్ చాంప్ కృష్ణ

Jul 29 2014 11:49 PM | Updated on Sep 2 2017 11:04 AM

నగరానికి చెందిన జాతీయ చెస్ ఆటగాడు సీఆర్‌జీ కృష్ణ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. రామ్‌నగర్‌లోని సూపర్ కిడ్స్ చెస్ అకాడమీలో మంగళవారం జరిగిన ఈ ఈవెంట్‌లో కృష్ణ అన్ని రౌండ్లలోనూ విజయం సాధించాడు.

సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన జాతీయ చెస్ ఆటగాడు సీఆర్‌జీ కృష్ణ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. రామ్‌నగర్‌లోని సూపర్ కిడ్స్ చెస్ అకాడమీలో మంగళవారం జరిగిన ఈ ఈవెంట్‌లో కృష్ణ అన్ని రౌండ్లలోనూ విజయం సాధించాడు. దీంతో అతను ఐదు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు. చివరి ఐదో రౌండ్ గేమ్‌లో కృష్ణ... ప్రత్యూష్ శ్రీవాస్తవపై గెలుపొందాడు. రెండో స్థానంలో వీఎస్‌ఎన్ మూర్తి నిలువగా... ప్రత్యూష్, ప్రవీణ్ భండారిలు వరుసగా మూడు, నాలుగు స్థానాలు పొందారు. విజేతలకు హైదరాబాద్ జిల్లా సంఘం కార్యదర్శి కన్నారెడ్డి మెడల్స్ అందజేశారు.
 
 3న అండర్-7 టోర్నీ
 సూపర్ కిడ్స్ చెస్ అకాడమీ వచ్చే నెల 3న హైదరాబాద్ జిల్లా సెలక్షన్ చాంపియన్‌షిప్‌ను నిర్వహించనుంది. అండర్-7, మహిళల చాలెంజర్, ఓపెన్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఎంట్రీలు పంపేందుకు మరిన్ని వివరాలకు కె.దయానంద్‌ను 9652617524 ఫోన్‌నంబర్లో సంప్రదించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement