అభిజిత్‌కు టైటిల్ | Abhijet won title | Sakshi
Sakshi News home page

అభిజిత్‌కు టైటిల్

May 24 2014 12:26 AM | Updated on Sep 2 2017 7:45 AM

అభిజిత్‌కు టైటిల్

అభిజిత్‌కు టైటిల్

గ్రాండ్ మాస్టర్, ప్రపంచ జూనియర్ మాజీ చాంపియన్ అభిజిత్ గుప్తా అగ్జమొవ్ మెమోరియల్ అంతర్జాతీయ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో సత్తా చాటాడు.

తాష్కెంట్: గ్రాండ్ మాస్టర్, ప్రపంచ జూనియర్ మాజీ చాంపియన్ అభిజిత్ గుప్తా అగ్జమొవ్ మెమోరియల్ అంతర్జాతీయ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో సత్తా చాటాడు. నిర్ణయాత్మకమైన చివరి రౌండ్‌లో నల్లపావులతో ఆడిన అభిజిత్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి రష్యా గ్రాండ్ మాస్టర్ ఒలెగ్ కొర్నీవ్‌పై విజయం సాధించాడు.
 
  తొమ్మిది రౌండ్‌ల ఈ టోర్నీలో 7.5 పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. 2600 ఎలో రేటింగ్ పైబడిన ఆటగాళ్లు బరిలోకి దిగిన ఈ టోర్నీలో ఏడో సీడ్ అభిజిత్ ఏడో రౌండ్‌లో టాప్ సీడ్ సెర్గి ఝిగాల్కో(బెలారస్)కు షాకివ్వడం కలిసొచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement