అంతలోనే కివీస్ టపటపా.. | New Zealand collapse against Ashwin | Sakshi
Sakshi News home page

అంతలోనే కివీస్ టపటపా..

Oct 10 2016 1:00 PM | Updated on Sep 4 2017 4:54 PM

అంతలోనే కివీస్ టపటపా..

అంతలోనే కివీస్ టపటపా..

భారత్ తో జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు లంచ్ విరామానికి న్యూజిలాండ్ స్కోరు 125/1. కానీ అంతలోనే కివీస్ టాపార్డర్ టపటపా నేలరాలిపోయింది

ఇండోర్:భారత్ తో జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు లంచ్ విరామానికి న్యూజిలాండ్ స్కోరు 125/1. భారత్ కు న్యూజిలాండ్ కు దీటుగానే బదులిస్తుందని అనుకున్నాం. కానీ అంతలోనే కివీస్ టాపార్డర్ టపటపా నేలరాలిపోయింది. మరోసారి రవి చంద్రన్ అశ్విన్ కు దాసోహమైన కివీస్ వరుసగా కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.

 

అశ్విన్ విజృంభణతో 23  పరుగుల వ్యవధిలో కివీస్ నాలుగు వికెట్లను నష్టపోయింది. న్యూజిలాండ్ ఆటగాళ్లు లాధమ్(53), విలియమ్సన్ (8), రాస్ టేలర్(0),ల్యూక్ రోంచీ(0)లు అశ్విన్ బౌలింగ్ లో వెనుదిరిగితే, గప్టిల్(72) రనౌట్ గా పెవిలియన్ చేరాడు. తొలి వికెట్ కు గప్టిల్-లాధమ్లు అందించిన 118 పరుగుల భాగస్వామ్యాన్ని కివీస్ సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement