కిడ్నాప్‌ చేసి నగ్నంగా బంధించాడు! | Kidnapped Triathlete Says She Sweet Talked Captor Into Letting Her Go | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ చేసి నగ్నంగా బంధించాడు!

Jul 29 2019 12:12 PM | Updated on Jul 29 2019 1:20 PM

Kidnapped Triathlete Says She Sweet Talked Captor Into Letting Her Go - Sakshi

చైర్‌లో తాళ్లతో కట్టేసి.. నగ్నంగా బంధించాడు..

వియన్నా: ఒక క్రీడాకారిణిని కిడ్నాప్‌ చేసి నగ్నంగా బంధించినా ఆమె చాకచక్యంగా బయటపడిన ఘటన సినిమా ట్విస్టును తలపిస్తోంది. ఆస్ట్రియాకు చెందిన ట్రయాథ్లెట్‌ నటాలీ బిర్లీ.. తన రెగ్యులర్‌ కార్యక్రమల్లో భాగంగా సైకిల్‌పై ప్రాక్టీస్‌ చేస్తోంది. ఇంతలో హఠాత్తుగా వెనకనుంచి వచ్చిన ఓ కారు ఆమె సైకిల్‌ను ఢీకొంది. దీంతో కింద పడిన ఆమెకు గాయాలు కాగా ఊహించని విధంగా కారు డ్రైవర్‌ ఓ కర్రతో ఆమె తలపై మోదాడు. ఆ తర్వాత స్పృహ కోల్పోయిన ఆమెను కారు వెనక సీటులోకి లాగి పడేశాడు. కొంత సేపటి తర్వాత ఒ‍క గదిలో ఆమెను నగ్నంగా మార్చి  తాళ్లతో బంధించాడు.

అంతేకాకుండా తీవ్ర ఆగ్రహంతో ఉన్న అతడు కత్తితో బెదిరిస్తూ మద్యం తాగాలంటూ ఆమెపై ఒత్తిడి చేశాడు.  బాత్‌ టబ్‌లో ముంచాలని లాక్కెళ్లాడు. దీంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతున్నదని గ్రహించిన నటాలీ ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని భావించింది. ఆ ఇంట్లో చాలా ఆర్చిడ్‌ పూల మొక్కలున్నట్టు ఆమె గ్రహించింది. అంతే.. తనకు కూడా ఆ పూలంటే పిచ్చి అంటూ అతడిని మెల్లిగా మాటల్లోకి దించింది. దీంతో అంతటి కసాయి కూడా ఒక్కసారిగా మారిపోయి నటాలీతో కబుర్లలో మునిగిపోయాడు.

తానో తోటమాలినని, తండ్రి చనిపోగా తల్లి మద్యానికి బానిసయ్యిందని తన జీవితం గురించి చెప్పుకొచ్చాడు. అలాగే ప్రియురాలు మోసం చేయడంతో కూడా సమాజంపై కసిని పెంచిందని ఆమెతో అన్నాడు. ఇక అతడు పూర్తిగా దారిలో కొచ్చాడని గ్రహించిన నటాలీ.. ఇద్దరం ఒక ఒప్పందానికి వద్దామని కిడ్నాపర్‌కు సూచించింది. దీని ప్రకారం తనను వదిలేస్తే అందరికీ యాక్సిడెంట్‌లో దెబ్బలు తగిలాయని చెబుతానని తెలిపింది. దీనికి అంగీకరించిన అతడు స్వయంగా కారులో ఇంటి దగ్గర దింపేసి వెళ్లిపోయాడు. అయితే నటాలీ మాత్రం ఊరుకోకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  ఆ కిడ్నాపర్‌ జైలుపాలయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement