ఆర్చర్‌ ఆరేశాడు

Jofra Archer Takes Six As Australia All Out For 179 In Third Test - Sakshi

ఆస్ట్రేలియా 179 ఆలౌట్‌

హెడింగ్లీ: నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ (6/45) విజృంభించడంతో యాషెస్‌ మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 52.1 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. గురువారం ఇక్కడ ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌... ఆర్చర్‌కు తోడు బ్రాడ్‌ (2/32) దెబ్బకు 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (94 బంతుల్లో 61; 7 ఫోర్లు), మార్నస్‌ లబషేన్‌ (129 బంతుల్లో 74; 10 ఫోర్లు) మూడో వికెట్‌కు 111 పరుగులు జోడించి ఆదుకున్నారు. వార్నర్‌ను ఔట్‌ చేసిన ఆర్చర్‌.. ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ పతనానికి బాటలు వేశాడు. లబషేన్‌ పోరాడుతున్నా మిగతావారు నిలకవపోవడంతో కంగారూ జట్టు 43 పరుగుల వ్యవధిలోనే 8 వికెట్లు కోల్పోయింది. ఆర్చర్‌ కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శనను నమోదు చేశాడు. వర్షం కారణంగా బుధవారం పూర్తిస్థాయి ఆట సాగలేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top