
ధోని 'సెంచరీ' కొడతాడా?
టీమిండియా నాయకుడు మహేంద్ర సింగ్ ధోని మరో రికార్డు ముంగిట నిలిచాడు.
మెల్‌బోర్న్: టీమిండియా నాయకుడు మహేంద్ర సింగ్ ధోని మరో రికార్డు ముంగిట నిలిచాడు. కెప్టెన్ గా 'సెంచరీ విక్టరీ' రికార్డుకు చేరువయ్యాడు. ప్రపంచకప్ లో భాగంగా గురువారం జరగనున్న రెండో క్వార్టర్ ఫైనల్ పోరులో బంగ్లాదేశ్ తో భారత్ తలపడనుంది.
ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే కెప్టెన్‌గా 100 వన్డేలు గెలిపించిన ఘనత ధోని సొంతమవుతుంది. ఓవరాల్‌గా పాంటింగ్ (165), బోర్డర్ (107) అతనికంటే ముందున్నారు. హ్యాన్సీ క్రానే(99), స్టీఫెన్ ఫ్లెమ్మింగ్(98) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ ప్రపంచకప్ లో టీమిండియాకు డబుల్ హ్యాట్రిక్ విజయాలు అందించిన ధోని సెంచరీ విక్టరీ అందుకుంటాడో, లేదో నేడు తేలనుంది.