ఆ ఇద్దరికీ నేను పెద్ద అభిమానిని: స్టోక్స్‌

I am a massive fan of both the players, Stokes - Sakshi

లండన్‌: త్వరలో వరల్డ్‌కప్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఆసీస్‌ మాజీ సారథి స్టీవ్‌ స్మిత్‌లపై ప్రశంసలు కురిపించాడు ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌. వారిద్దరూ ఏ స్థితిలోనైనా ఆటను తమ వైపు తిప్పగల సమర్థులని స్టోక్స్‌ కొనియాడాడు. ప్రపంచ క్రికెట్‌లో కోహ్లి, స్మిత్‌లు ప్రత్యేక స్థానం సంపాదించి తమదైన ముద్ర వేశారన్నాడు. ఈ దిగ్గజ ఆటగాళ్లకు తాను పెద్ద అభిమానిని స్టోక్స్‌ పేర్కొన్నాడు.

‘కోహ్లి, స్మిత్‌ అద్భుతమైన ఆటగాళ్లు. ఎక్కువ సార్లు ప్రత్యర్థులుగా ఆడారు. మీరు వారిద్దరినీ గమనిస్తే మిగతా వారి కన్నా ఎంతో సులభంగా ఆటను మార్చేస్తారు. వారిద్దరి బ్యాటింగ్‌ శైలి భిన్నమే కానీ గెలుపు కోసమే ఆడతారు. అత్యంత నిలకడగా వారిద్దరూ క్రికెట్‌ ఆడటాన్ని  చూసి ఆస్వాదిస్తాను. ఆ ఇద్దరికీ నేను పెద్ద అభిమానిని ’ అని బెన్‌స్టోక్స్‌ అన్నాడు. ఇక తమ జట్టు ఆట గురించి స్టోక్స్‌ మాట్లాడుతూ..  ‘గత మూడు, నాలుగేళ్లుగా మా క్రికెట్‌తో ప్రపంచకప్‌నకు మేం ఫేవరెట్‌గా గుర్తింపుపొందాం. ప్రపంచ నంబర్‌ వన్‌ జట్టంటే అన్ని టోర్నీల్లోనూ ఫేవరెట్‌గానే అడుగుపెడుతుంది. ఆస్ట్రేలియా, భారత్‌ సైతం మినహాయింపు కాదు. మేం టోర్నీ గెలవాలనుకుంటే మాత్రం నంబర్‌వన్‌గా ప్రవేశించం.  2017 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాక్‌తో మ్యాచ్‌లో రూపొందించిన వికెట్‌ మా క్రికెట్‌ శైలికి అనుకూలంగా లేదు. పాక్‌కు సరిపోయింది. ఆ ఓటమి నుంచి మేం నేర్చుకొని అలాంటి పరిస్థితుల్లో ఎలా ఆడాలో తెలుసుకున్నాం. అప్పటితో పోలిస్తే మేమిప్పుడు మరెంతో మెరుగయ్యాం’ అని స్టోక్స్‌ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top