హైదరాబాద్‌కు భారీ ఆధిక్యం | Hyderabad take first innings lead over Goa | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు భారీ ఆధిక్యం

Oct 9 2016 12:58 AM | Updated on Oct 5 2018 9:09 PM

రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో భాగంగా గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 224 పరుగుల ఆధిక్యం సాధించింది.

 గోవాతో రంజీ మ్యాచ్  
 నాగ్‌పూర్: రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో భాగంగా గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 224 పరుగుల ఆధిక్యం సాధించింది. శనివారం జరిగిన మూడో రోజు ఆటలో హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్‌‌సలో 130 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌట్ అయింది. అక్షత్ రెడ్డి (222 బంతుల్లో 128; 20 ఫోర్లు)కి తోడుగా సందీప్ (234 బంతుల్లో 108; 11 ఫోర్లు, 1 సిక్స్) కూడా శతకం బాదడంతో జట్టు భారీ స్కోరు సాధించింది.
 
  మెహదీ హసన్ (112 బంతుల్లో 62; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. అమిత్ యాదవ్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం తమ రెండో ఇన్నింగ్‌‌స ఆరంభించిన గోవా ఆట ముగిసే సమయానికి 2.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 5 పరుగులతో ఉంది. క్రీజులో దేశాయ్ (2 బ్యాటింగ్), అస్నోడ్కర్ (2 బ్యాటింగ్) ఉన్నారు. గోవా ఇంకా 219 పరుగులు వెనబడి ఉంది.
 
 మూడో రోజూ వర్షం ఆటంకం
 ఆంధ్ర, హిమాచల్ ప్రదేశ్ జట్ల మధ్య భువనేశ్వర్‌లో జరుగుతున్న గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌కు మూడో రోజు కూడా వర్షం అంతరాయం కలిగింది. దీంతో 27.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. హిమాచల్ జట్టు తమ ఓవర్‌నైట్ స్కోరుకు మరో 39 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్‌‌సలో 93.2 ఓవర్లలో 357 పరుగులు చేసింది. సుమీత్ వర్మ (142) సెంచరీ చేశాడు. అనంతరం తమ తొలి ఇన్నింగ్‌‌స ఆరంభించిన ఆంధ్ర ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. ప్రశాంత్ (21 బ్యాటింగ్), విహారి (20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement