ప్రధానితో ప్రపంచకప్‌ విజేత

England Team Meet Theresa May Post World Cup Victory - Sakshi

లండన్‌ : సొంతగడ్డపై వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్‌ విజయ సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలిసారి తమ దేశానికి టైటిల్‌ గెలిచిన మోర్గాన్‌ సేన మంగళవారం దేశ ప్రధాని థెరెసా మే ను మర్యాదపూర్వకంగా కలిశారు. 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లోని ప్రధాని అధికారిక కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆటగాళ్లంతా పాల్గొన్నారు. ‘ఇంగ్లండ్‌ ప్రజలు క్రికెట్‌పై మళ్లీ ప్రేమను పెంచుకునేలా మీరు చేశారు. ఫైనల్‌ మ్యాచ్‌ను అత్యుత్తమ క్రీడా ఘట్టాల్లో ఒకటిగా చెప్పగలను. ఇరు జట్ల అద్భుతమైన ఆటతో పాటు కొంత అదృష్టం కూడా కలగలిసి ఒక థ్రిల్లర్‌ను మనకు అందించాయి. ఇంత గొప్ప టోర్నీకి ఇది సరైన ముగింపు. మన దేశాన్ని క్రీడల్లో ప్రముఖంగా నిలిపిన అందరికీ అభినందనలు’ అని ఈ సందర్భంగా ప్రధాని థెరెసా వ్యాఖ్యానించారు.  కార్యాలయ గార్డెన్స్‌లో జరిగిన ‘షాంపేన్‌ రిసెప్షన్‌’లో క్రికెటర్లు  ప్రధానితో సరదాగా కబుర్లు చెబుతూ తమ గెలుపును ఆస్వాదించడం విశేషం.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top