హెచ్‌సీఏ కమిటీ సభ్యులపై కేసు నమోదు | case filed on hca members | Sakshi
Sakshi News home page

హెచ్‌సీఏ కమిటీ సభ్యులపై కేసు నమోదు

Dec 17 2016 11:54 AM | Updated on Sep 4 2017 10:58 PM

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సభ్యులపై ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది.

హైదరాబాద్ :  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సభ్యులపై ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-12 ఎమ్మెల్యే కాలనీకి చెందిన వ్యాపారి ప్రకాష్‌చంద్ జైన్ (56)ను గత నెల 20వ తేదీన నిర్వహించిన హెచ్‌సీఏ సర్వసభ్య  సమావేశంలో రోజూవారీ బాధ్యతల నిర్వహణకై  అడ్‌హక్ కమిటీ చైర్మన్‌గా నియమించారు. అరుుతే ఈ నెల 5వ తేదీన, 16వ తేదీన విధుల నిమిత్తం స్టేడియంలోకి వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడ వుండే సెక్యూరిటీ లోనికి వెళ్లకుండా ఆయనను అడ్డుకున్నారు.

 

సెక్యూరిటీని ప్రశ్నించగా హెచ్‌సీఏ అధ్యక్షులు అర్షద్ అయూబ్, కార్యదర్శి జాన్ మనోజ్, సంయుక్త కార్యదర్శి పురుషోత్తం అగర్వాల్, ఉపాధ్యక్షుడు నరేందర్‌గౌడ్, కోశాధికారి దేవరాజ్, ఈసీ సభ్యుడు మహమూద్‌లు లోనికి అనుమతించవద్దని తెలిపారని సెక్యూరిటీ వివరించాడు. దాంతో ప్రకాష్‌చంద్ జైన్ శుక్రవారం ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అడ్‌హక్ కమిటీ చైర్మన్ అరుున తనను స్టేడియంలోకి వెళ్లకుండా అడ్డుకొని అవమానించారని వారిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement