క్వార్టర్స్‌లో అజయ్, రాజీవ్‌ | ajay and rajeev in quarter final of telangana open snooker | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో అజయ్, రాజీవ్‌

Aug 11 2017 10:45 AM | Updated on Sep 17 2017 5:25 PM

క్వార్టర్స్‌లో అజయ్, రాజీవ్‌

క్వార్టర్స్‌లో అజయ్, రాజీవ్‌

తెలంగాణ ఓపెన్‌ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌లో అజయ్‌ భూషణ్, రాజీవ్‌ ఇనుగంటి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఓపెన్‌ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌లో అజయ్‌ భూషణ్, రాజీవ్‌ ఇనుగంటి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో అజయ్‌ 4–3 (21–63, 65–35, 43–44, 59–7, 76–38, 11–65, 87–38)తో రషీద్‌ ఖురేషిపై గెలుపొందగా, రాజీవ్‌ 4–2 (69–43, 73–01, 25–67, 65–17, 42–92, 61–34)తో ఖైజర్‌ రవూఫ్‌ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో బాలకృష్ణ 4–1 (70–25, 56–21, 58–51, 44–64, 77–32)తో పి. హేమంత్‌ కుమార్‌పై, ఇ. పాండురంగయ్య 4–0 (65–26, 61–32, 59–37, 72–45)తో సయ్యద్‌ అహ్మద్‌ హుస్సేన్‌పై గెలుపొందారు.

 

అంతకుముందు జరిగిన మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో లక్కీ వత్నానీ 4–3 (51–78, 69–34, 59–24, 45–56, 71–55, 45–57, 49–37)తో జేమ్స్‌ సుందర్‌ రాజ్‌పై, నరేశ్‌ కుమార్‌ 4–3 (70–43, 45–59, 47–17, 49–35, 51–60, 54–13)తో క్లింటన్‌పై, కె. వెంకటేశం 4–3 (53–66, 82–33, 82–37, 54–12, 27–60, 52–62, 57–22)తో మొహమ్మద్‌ గౌస్‌పై, విశాల్‌ అగర్వాల్‌ 4–1 (87–33, 54–32, 51–63, 67–22, 60–58)తో బీఎల్‌ ధీరజ్‌పై, మీర్‌ అబిద్‌ అలీ 4–2 (62–24, 79–08, 54–32, 23–58, 30–60, 57–28)తో అశ్విన్‌ రావుపై గెలుపొంది ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement