‘రాజధాని పేరుతో బాబు పెద్ద స్కామ్‌ చేశారు’ | YSRCP MLA Gudivada Amarnath Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘రాజధాని పేరుతో చంద్రబాబు పెద్ద స్కామ్‌ చేశారు’

Dec 17 2019 3:29 PM | Updated on Dec 17 2019 4:37 PM

YSRCP MLA Gudivada Amarnath Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి : రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని వైఎస్సార్‌సీసీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ఆరోపించారు. అసైన్డ్‌ భూములను బలవంతంగా లాక్కొని తన బినామీలకు కట్టబెట్టారని విమర్శించారు.  రాజధాని నిర్మాణంపై చర్చ సందర్భంగా మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజధాని పేరుతో డ్రామాలాడారే తప్ప ఒక్క శాశ్వత భవనం నిర్మించలేదని మండిపడ్డారు. చంద్రబాబుకు వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని విమర్శించారు.

రాజధాని పేరుతో కోట్ల రూపాలయను దుర్వినియోగం​ చేశారన్నారు. సింగపూర్‌, మలేషియా, బీజింగ్‌ అంటూ ప్రజలకు భ్రమలు కల్పించారని ఆరోపించారు. రాజధానిలో నాలుగు విఠలాచారి సెట్టింగులు తప్ప.. ఒక్క శాశ్వత కట్టడం లేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఒలింపిక్స్‌ను అమరావతిలో నిర్వహిస్తామని చెప్పిన చంద్రబాబు.. కనీసం మండల స్థాయి పోటీలు జరిపే విధంగా కూడా సదుపాయాలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. చంద్రబాబు హయంలో​ రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలలో అభివృద్ధి జరగలేదన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement