రాహుల్ జిన్నా అయితే బావుంటుంది : జీవీఎల్‌

Rahul Jinnah Name More Suitable For Rahul Gandhi Says GVL Narasimha Rao - Sakshi

న్యూఢిలీ: ‘తన పేరు రాహుల్‌ సావర్కర్‌ కాదని... రాహుల్‌ గాంధీ’ అని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహరావు మండిపడ్డారు. రాహుల్‌ గాంధీకి రాహుల్‌ జిన్నా అనే పేరు అయితే సరిగా సెట్‌ అవుతుందని విమర్శించారు. ముస్లింలను మెప్పించేలా రాజకీయాలు చేస్తున్నా రాహుల్‌కు సావర్కర్‌ అనే పేరు కంటే ముహమ్మద్ అలీ జిన్నా పేరు అయితే కరెక్ట్‌గా సరిపోతుందని ఎద్దేవా చేస్తూ ట్విట్‌ చేశారు. 

నా పేరు రాహుల్‌ సావర్కర్‌ కాదు :

 ఢిల్లీలో జరిగిన భారత్‌ బచావో ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తాను నిజాలు నిర్భయంగా మాట్లాడతానని.. అందుకు ఎన్నటికీ క్షమాపణ చెప్పబోనని అన్నారు. తన పేరు రాహుల్‌ సావర్కర్‌ కాదని... రాహుల్‌ గాంధీ అంటూ బీజేపీ విమర్శలను తిప్పికొట్టారు. రాహుల్‌ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. కాంగ్రెస్‌ చేపట్టిన ర్యాలీ.. భారత్‌ బచావ్‌ కాదని, కాంగ్రెస్‌ బచావో అని జీవీఎస్‌ ఎద్దేవా చేశారు.  కుటుంబంతో విహారయాత్రకు వెళ్లారంటూ హేళన చేశారు. అధికారం రాని కారణంగా వారు (కాంగ్రెస్ పార్టీ‌) పడుతున్న బాధలను ప్రదర్శించడానికే ఈ ర్యాలీని నిర్వహించారని కాంగ్రెస్‌ పార్టీని జీవీఎల్‌ నరసింహరావు దుయ్యబట్టారు. 

ఇక ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా భారత ఆర్థికవ్యవస్థను నాశనం చేశారని రాహుల్‌గాంధీ ఆరోపణలు చేయడాన్ని తప్పుపడుతూ.. దేశ శత్రువులందరూ భారతదేశానికి బలమైన ఆర్థిక వ్యవస్థను నాశనం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top