
కొత్తపల్లి (కరీంనగర్): ఆర్టీసీని పునర్‌వ్యవస్థీకరించకుండా ఉద్యోగులు, కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు బాధ్యతారాహిత్యమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం సీతారాంపూర్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. డిమాండ్ల సాధనకు సమ్మెకు వెళ్తామ ని ప్రకటిస్తే ఉద్యోగాలు ఊడుతాయ ని సీఎం ప్రకటించడం శోచనీయమన్నారు. ఆర్టీసీని రక్షించాల్సింది పో యి బాధ్యతను మరచి మాట్లాడటం మంచిదికాదని హితవు పలికారు. కొత్త బస్సులతో పాటు కార్మికుల సంఖ్య పెంచకుంటే ఆర్టీసీ ఎలా మనుగడ సాధిస్తుందని ప్రశ్నించారు.