జైట్లీ లేని లోటు నాకు వ్యక్తిగత నష్టం: వెంకయ్య

Arun Jaitley demise:Huge Loss To Nation, Says Venkaiah - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీమంత్రి అరుణ్‌ జైట్లీ మృతిపట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం చెన్నై పర్యటనలో ఉన్న ఆయన...జైట్లీ మరణవార్త వినగానే హుటాహుటీన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘జైట్లీ లేని లోటు దేశానికి తీర్చలేనిది. నాకు అత్యంత సన్నిహితుడు. ఆయన లేని లోటు నాకు వ్యక్తిగత నష్టం. అనేక పార్టీల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడంలో జైట్లీ సిద్ధహస్తుడు. జీఎస్టీ లాంటి సంస్కరణలు విజయవంతంగా అమలు చేయడంలో ఆయన కృషి ఎంతో ఉంది. అత్యుత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డు అందుకున్నారు. నీతి నిజాయితీ, విలువలకు కట్టుబడి రాజకీయ జీవితాన్ని కొనసాగించారు.’ అని వెంకయ్య ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 

మరోవైపు జైట్లీ మరణంతో  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర ముఖ్య నాయకులు  తిరుపతిలోని పలు కార్యక్రమాలు రద్దు చేసుకుని ఢిల్లీ పయనం అయ్యారు.

చదవండిఅరుణ్‌ జైట్లీ అస్తమయం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top