స్వాతంత్య్రోద్యమ వీర సావర్కర్

స్వాతంత్య్రోద్యమ వీర సావర్కర్


భారత స్వాతంత్య్రోద్యమం తొలినాళ్లలో సుభాష్ చంద్రబోస్, లెనిన్‌లతో పరిచయమున్న వీర సావర్కర్ అన్ని మత గ్రంథాలను అధ్యయనం చేశారు. కానీ హిందూ జాతిని మనస్ఫూర్తిగా ప్రేమించారు.

 

1857వ సంవత్సరంలో జరిగిన ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం ఓడి పోయి ఉండవచ్చు కానీ అది రగిలించిన స్వాతంత్య్ర సము పార్జన కాంక్ష ఎన్నో పోరాటా లకు నాంది పలికింది. లోక మాన్య తిలక్, సుభాష్ చంద్ర బోస్, మోహన్‌దాస్ గాంధీ వంటి నాయకుల ఆవిర్భావానికి కారణమైంది. గాంధీ నాయకత్వం సత్యం-అహింస మార్గాలనవలంబిస్తే వీర సావర్కర్, భగత్‌సింగ్, మదన్‌లాల్ ధింగ్రా, రాజగురు వంటి వారు క్రాంతికారులైనారు. వారు చేసిన బలిదా నాల వల్లనే చివరకు శాంతి, సంప్రదింపులు, సర్దుబాట్ల బాటలో మనం స్వతంత్రులైనాము. సావర్కర్ అనగానే మనకు విప్లవ వీరుడే గుర్తుకు వస్తాడు. కానీ ఆయన వ్యక్తిత్వం, రాజనీతిజ్ఞత, బహుముఖ ప్రజ్ఞ, దార్శనికత, సాహిత్య కృషి, హిందూ సమాజానికి చేసిన సేవలు బహుకొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎందుకంటే క్రాం తికారుల బలిదానాల విలువను గుర్తించడం అరుదు.

 

1883, మే 10వ తేదీన మహారాష్ట్ర, నాసిక్ జిల్లా లోని భాగూర్ గ్రామంలో దామోదర పంత్ - రాధా బాయి సావర్కర్ దంపతులకు రెండవ కుమారునిగా జన్మించి, 1966, ఫిబ్రవరి 26వ తేదీన మహా నిర్యాణం చెందిన వినాయక్‌రావు సావర్కర్ జీవితం మన స్వాతం త్య్ర పోరాటంలో ఒక ముఖ్యమైన పార్శ్వం. అతిచిన్న వయస్సులో సావర్కర్ సోదరులు తమ కుల దేవతయైన భవానీ మాత చెంత భారతమాత స్వాతంత్య్రానికై తమ సర్వస్వమూ త్యాగం చేస్తామని ప్రతిన పూనారు. కొంత మంది స్నేహితులను కలుపుకొని మిత్రమేళా అనే పేరుతో విప్లవకారుల బృందాన్ని తయారు చేశారు. నాలుగైదు సంవత్సరాలలో ఆ బృందం ‘అభినవ భారత్’గా అవతరించి అనేక రూపాలలో పశ్చిమ మధ్య భారత్, ఐరోపా, కెనడా, ఇంగ్లండ్, జపాన్ దేశాలలో భారత స్వాతంత్య్ర సాధనకై పనిచేసింది.

 

నాసిక్‌లో ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశాక పుణే లోని పెర్గూసన్ కళాశాలలో చదువుకునే రోజులలో లోకమాన్యతిలక్‌తో ఆయన పరిచయం బార్-ఎట్-లా పట్టా కోసం లండన్ ప్రయాణానికి దారితీసింది. లండన్‌లో ఐరోపా దేశాలలోని అనేక విప్లవ బృందాలతో పరిచయాలు ఏర్ప రచుకున్నారు. ఇండియా హౌస్‌లో నెల కొల్పిన విప్లవ బృందం భారతదేశానికి ఆయుధాలు, విప్లవ సాహిత్యం పంప డం వంటి పనులు చేసేవారు. ఆ సమ యంలోనే సావర్కర్‌కు సుభాష్ చంద్రబోస్, లెనిన్‌లతో పరిచయాలయ్యాయి. 1910, మార్చి 13న విప్లవ కార్య క్రమాలలో పాల్గొంటున్నందుకుగాను ఆయనను అరెస్టు చేసి భారత్‌కు పంపబోయారు.

 

సముద్రంలోకి దూకి తప్పించుకో ప్రయత్నం చేసిన సావర్కర్‌ను మళ్లీ అరెస్టు చేసి బొంబాయిలో విచారణ జరిపి యాభై సంవత్స రాల కఠినశిక్ష విధించి అండమాన్ దీవులకు తరలిం చారు. ఆయన ఆస్తి మొత్తం జప్తు చేశారు. మనకు స్వా తంత్య్రం వచ్చాక కూడా ఆయన ఆస్తి తిరిగి ఇవ్వలేదు.

 

ఏ పరిస్థితుల్లో తానున్నా లక్ష్యాన్ని మరువకపోవ డం సావర్కర్‌లోని విశేషం. అండమాన్ జైలు గోడల మీద అనేక గీతాలు రచించి, విడుదల కాబోయే ఖైదీలకు నేర్పి, వారి ద్వారా మహారాష్ట్రలో ప్రచారం చేసేవారు. ఆ జైలులో ఉన్నప్పుడే కమల, సప్తఋషి, విరోచ్వాసి అనే గీతాలు, కాలాపానీ, మోప్లాంచిబంద్ అనే నవలలు, మాజీ జన్మఠేప్ అనే స్వీయ చరిత్ర, సన్యస్థ ఖడ్గ, ఉషాప్, ఉత్తర క్రియ అనే నాటకాలు రచించారు. భారత దేశంలో ఆయన విడుదలకై జరిగిన పోరాటాల వల్ల పదకొండు సంవత్సరాల తర్వాత భారతదేశంలోని జైలుకు మార్చా రు.

 

చివరకు ఐదు సంవత్సరాలు రాజకీయాలలో పాల్గొ నకూడదనే ఆంక్షలతో 1924లో ఆయనను జైలు నుంచి విడుదల చేశారు. ఆ 5 సంవత్సరాల కాలాన్ని ఆయన హిందువులను సంఘటితం చేసేందుకు, అంటరాని తనం నిర్మూలనకు ఉపయోగించుకున్నారు. రత్నగిరి జైలులో ఉండగా ఆయన రచించిన ‘హిందుత్వ’ అనే పుస్తకం హిందూ నిర్వచనానికి ఉపనిషత్తుల వంటిది.

 

ఆయనపై విధించిన ఆంక్షలన్నీ తొలిగాక 1937 నుంచి హిందూ మహాసభ అధ్యక్షునిగా ప్రత్యక్ష రాజకీ యాలలో చాలా కృషి చేశారు. సావర్కర్‌కు ఏ మతం పైనా ద్వేషంలేదు. ఆయన అన్ని మత గ్రంథాలను అధ్య యనం చేశారు. కానీ హిందూ జాతిని మనస్ఫూర్తిగా ప్రేమించారు. ఆ జాతి సర్వాంగీణ ఉన్నతికై నిరంతరం శ్రమించారు. మతోన్మాదం చాలా ప్రమాదకారి యని మానవచరిత్రలో దేవుని పేరుతో జరిగినంత మారణ హోమం ధనపిపాస వల్ల జరగలేదనే వారు. వేదాంత గ్రంథాలు చదివే బదు లు విజ్ఞానశాస్త్రం, రాజకీయశాస్త్రం, సాంఘికశాస్త్రం, ఆర్థికశాస్త్రం చదివి యోగ్యతతో జీవించి గృహస్థాశ్రమ ధర్మాలను నిర్వర్తించాలని చెప్పేవారు.

 

1937లో అహమ్మదాబాద్‌లో జరి గిన అఖిల భారత హిందూ మహాసభ లకు అధ్యక్షోపన్యాసం చూస్తూ ‘భారత రాజ్యాన్ని పూర్తి భారతీయంగానే ఉండ నివ్వండి. ఎన్నికల హక్కులలోగాని, ఉద్యోగాలలోగాని, పదవులలోగాని, పన్నుల విధానాలలోగాని, హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య భేదాలు చూపవద్దు. భారత రాజ్యంలోని ప్రతి వ్యక్తినీ వ్యక్తిత్వం ఆధారంగా నిలబడ నివ్వండి. ఒక వ్యక్తికి ఒక ఓటు అనే దానిని సర్వజనీన సిద్ధాంతంగా ఉంచండి’ అని అన్నారు. సావర్కర్ గొప్ప రాజకీయ దార్శనికుడు. దేశ విభజన జరిగి ఒక ముస్లిం దేశం ఏర్పడగలదని 1937లోనే అన్నారు. 1963లో భార తదేశంపై చైనా యుద్ధం ప్రకటించినప్పుడు ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయన కళ్లల్లో నీళ్లు మొదటిసారి చూశానని ఆయన కుమారుడు తెలిపాడు.

 

1966లో తనకు తీరవలసిన కోర్కెలేమీలేవని, తన ధ్యేయసాధన పూర్తయింది కాబట్టి స్వసంకల్పంతోనే తమ దేహాన్ని త్యజిస్తానని ప్రకటించి, క్రమంగా ప్రపం చంతో సంబంధాలను తెంచుకుని దేహత్యాగానికి సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఆహారం, మం దులు నిరాకరించి 22 దినాలు కొద్ది నీటితో మాత్రం జీవించి ఫిబ్రవరి 26వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు దేహత్యాగం చేశారు. మన దేశానికి స్వాతం త్య్రం సిద్ధించాక ఆ మనీషి రెండు దశాబ్దాలు జీవించిన ప్పటికీ ఆయన సేవలను మన జాతి పూర్తిగా ఉపయో గించుకోలేకపోవడం విషాదకరం. ఆయన చరిత్రను నేటి తరానికి పరిచయం చేయడం ఎంతైనా అవసరం.

 

 సోమరాజు సుశీల


(ఫిబ్రవరి 26న సావర్కర్ 48వ వర్ధంతి)

 (వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి)

  suseelasomaraju@gmail.com

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top