
84 లక్షల ఆసనాలలో..
యోగాసనాలు ఎన్ని? అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇవాళ ప్రపంచానికి పరిచయం చేస్తున్నవి ఎన్ని?
యోగాసనాలు ఎన్ని? అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇవాళ ప్రపంచానికి పరిచయం చేస్తున్నవి ఎన్ని? మొత్తం 84 లక్షల యోగాసనాలు ఉన్నాయనీ, ఈరోజు వాటిలో 35 ఆసనాలనే పరిచయం చేస్తున్నామని, ఢిల్లీకి చెందిన మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగాలో శిక్షకురాలు ఇషా చెప్పారు. ఇవి శరీరాయాసం లేకుండా వేయగలిగిన ఆసనాలే. యోగాసనాల ధ్యేయం: భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్వాస్థత. వేదకాలానికి ముందు నుంచి ఆసనాల ప్రసక్తి కనిపిస్తుంది.
బౌద్ధం, ఇందులోని వజ్రయానం, టిబెటన్ బౌద్ధాలలో కూడా వీటి ప్రస్తావన ఉంది. జైనం, ఇస్లాం సమాజాలలో కూడా వీటికి స్థానం కనిపిస్తుంది. 11వ శతాబ్దంలో భారతదేశంలో పర్యటించి, 16 ఏళ్లు గడిపిన అల్ బెరూనీ చాలా సంస్కృత గ్రంథాలతో పాటు పతంజలి యోగసూత్రాలను కూడా పర్షియన్‌లోకి అనువదించాడు. కానీ సున్నీ శాఖలో యోగాసనాల పట్ల వ్యతిరేకత ఉంది. 2008లో మలేసియాలో యోగాభ్యాసాన్ని నిషేధిస్తూ ఫత్వా కూడా జారీ చేశారు. ఇవన్నీ ఎలా ఉన్నా యోగం ప్రకృతి నుంచి, జంతుజాలం నుంచి మనిషి నేర్చుకున్నాడని శిక్షకులు చెబుతారు.