
నిజామాబాద్‌కల్చరల్(నిజామాబాద్‌అర్బన్): హీరోయిన్ కాజల్ అగర్వాల్ నేడు నగరానికి రానున్నారు. జిల్లా కేంద్రంలోని రాష్ట్రపతి రోడ్‌లో ఆధునిక హంగులతో రూపొందించిన కిసాన్ ఫ్యాషన్ మాల్‌ను కాజల్ ప్రారంభించనున్నారని కిసాన్ గ్రూప్ చైర్మన్ ధన్‌పాల్ సూర్యనారాయణగుప్తా తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వంశీ హోటల్‌లో ఆయన తన కుమారులు ప్రణయ్‌కుమార్, ఉదయ్‌కుమార్, వస్త్ర వ్యాపారులు వాసు, రత్తయ్యల తో కలిసి విలేకరులతో మాట్లాడారు. మా రుతున్న కాలానికి అనుగుణంగా కస్లమర్ల కు సేవలందించడానికి కిసాన్ మాల్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. దశాబ్దాలుగా తమ కస్టమర్లకు మరింత మెరుగైన, ఉత్తమమైన సేవలందించాలనే ఉద్దేశ్యంతో కిసాన్ మాల్‌ను తీర్చిదిద్దామని తెలిపారు. కిసాన్ మాల్‌లో నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందిస్తున్నామని, 25 వేల చదరపు అడుగులతో అన్ని అంగులతో ఆధునిక వస్త్ర ప్రపంచాన్ని ఉమ్మడి జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. 1952 నుంచి కస్లమర్లు ఆదరిస్తున్నారని, ఇదే ఆదరణను మున్ముందు అందించాలని కోరారు.