పుట్టింటినుంచి తాము తెమ్మన్న రెండు లక్షల రూపాయలు తేనందుకు గాను ఉత్తరప్రదేశ్లో ఓ మహిళను ఆమె భర్త, మరిది కలిసి కొట్టి చంపేశారు.
పుట్టింటినుంచి తాము తెమ్మన్న రెండు లక్షల రూపాయలు తేనందుకు గాను ఉత్తరప్రదేశ్లో ఓ మహిళను ఆమె భర్త, మరిది కలిసి కొట్టి చంపేశారు. ఫత్మా అనే ఆ బాధితురాలికి అజ్మత్ అలీతో 12 ఏళ్ల క్రితం పెళ్లయింది, వారికి ఇద్దరు పిల్లలుకూడా ఉన్నారు. భోపా పట్టణంలోని ఆమె అత్తవారింట్లో శుక్రవారం రాత్రి ఆమెను కొట్టి చంపేశారు.
అజ్మత్, అతడి తమ్ముడు హస్మత్ ఇద్దరి మీద పోలీసులు హత్యకేసు నమోదు చేశారు. వాళ్లిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పుట్టింటి నుంచి డబ్బు తేవాల్సిందిగా గత కొన్నాళ్ల నుంచి ఆమెపై వాళ్లు ఒత్తిడి చేస్తున్నారు. దానికోసం తరచు ఆమెను కొడుతున్నట్లు బాధితురాలి సోదరుడు హసన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.