రెండంతస్తుల భవనంలో మంటలు | Two-storey building in north-west Delhi gutted in fire | Sakshi
Sakshi News home page

రెండంతస్తుల భవనంలో మంటలు

Apr 27 2016 6:54 PM | Updated on Sep 3 2017 10:53 PM

రెండుంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించిన ఘటన సంజయ్ గాంధీ ట్రాన్స్పోర్ట్ నగర్లోని వాయువ్య ఢిల్లీలో బుధవారం చోటుచేసుకుంది.

ఢిల్లీ: రెండుంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించిన ఘటన సంజయ్ గాంధీ ట్రాన్స్పోర్ట్ నగర్లోని వాయువ్య ఢిల్లీలో బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరిగినట్టు గుర్తించలేదని పోలీసులు చెప్పారు. కాకపోతే భారీగా ఆస్తినష్టం వాటిల్లి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. భవనం పైభాగంలో నిల్వ ఉంచిన పాత టైర్లు, ప్లాస్టిక్ వస్తువులకు మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగ బారి భవనం నలువైపులా వ్యాపించింది.

సమాచారం అందుకున్న 12 మంది అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తేవడానికి గంటల తరబడి శ్రమించిన అనంతరం అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, షాట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

పోల్

Advertisement