ప్రధాని మోదీతో తెలంగాణ గవర్నర్‌ భేటీ | Telangana Governor Tamilisai Soundararajan Meeting With PM Modi In Delhi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీతో తెలంగాణ గవర్నర్‌ భేటీ

Oct 15 2019 8:02 PM | Updated on Oct 15 2019 8:25 PM

Telangana Governor Tamilisai Soundararajan Meeting With PM Modi In Delhi - Sakshi

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో గవర్నర్‌ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటలో ఉన్న తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్ రాజన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దాదాపు అరగంటపాట సాగిన ఈ సమావేశంలో తెలంగాణలో తాజా రాజకీయ, శాంతి భద్రతల పరిస్థితుల్ని గవర్నర్‌ ప్రధానికి వివరించారు.  తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తమిళిసై మోదీని కలవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇక ప్రధానితో భేటీ అనంతరం తమిళిసై హోంమంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో గవర్నర్‌ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గత 11 రోజులుగా రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెతో పలు చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఉద్యోగం పోతుందనే బెంగతో ఇద్దరు ఆర్టీసీ కార్మికులు బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement