హర్యానా మాజీ డీజీపీకి ఊరట | Ruchika molestation case: SC upholds former Haryana DGP Rathore's conviction | Sakshi
Sakshi News home page

హర్యానా మాజీ డీజీపీకి ఊరట

Sep 23 2016 1:46 PM | Updated on Sep 4 2017 2:40 PM

రుచికా గిర్హోత్రాపై వేధింపుల కేసులో హర్యానా మాజీ డీజీపీ ఎస్ పీఎస్ రాథోడ్ కు ఊరట లభించింది.

న్యూఢిల్లీ: టెన్నిస్ క్రీడాకారిణి రుచికా గిర్హోత్రాపై వేధింపుల కేసులో హర్యానా మాజీ డీజీపీ ఎస్ పీఎస్ రాథోడ్ కు ఊరట లభించింది. ఆయనకు విధించిన జైలు శిక్షను తగ్గించింది. రాథోడ్ వేధింపులు భరించలేక రుచిక 1993, డిసెంబర్ 28న విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.

ఈ కేసులో 22 ఏళ్ల తర్వాత 2009లో చండీగఢ్ కోర్టు రాథోడ్ ను దోషిగా తేల్చింది. 18నెలలు శిక్ష విధించడంతో 2010, జూన్ లో ఆయనను జైలులో పెట్టారు. ఐదు నెలలు శిక్ష అనుభవించిన తర్వాత ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. సుప్రీంకోర్టు జైలు శిక్ష తగ్గించడంతో ఆయన జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే ఆయనను దోషిగానే న్యాయస్థానం పరిగణిస్తోంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement