అప్పుడే జిల్లాలెందుకు?: రాపోలు | Rapolu comments on new districts | Sakshi
Sakshi News home page

అప్పుడే జిల్లాలెందుకు?: రాపోలు

Jun 25 2016 3:39 AM | Updated on Aug 14 2018 10:59 AM

అప్పుడే జిల్లాలెందుకు?: రాపోలు - Sakshi

అప్పుడే జిల్లాలెందుకు?: రాపోలు

రాష్ట్ర విభజన అనంతరం ఇంకా ఉన్నతాధికారుల విభజనే పూర్తికాలేదని, అప్పుడే కొత్త జిల్లాలు ఎందుకంటూ సీఎం కేసీఆర్‌కు రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ శుక్రవారం లేఖ రాశారు.

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం ఇంకా ఉన్నతాధికారుల విభజనే పూర్తికాలేదని, అప్పుడే కొత్త జిల్లాలు ఎందుకంటూ సీఎం కేసీఆర్‌కు రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ శుక్రవారం లేఖ రాశారు. రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో కావలసినంత మంది అధికారులు, ఉద్యోగులు, అఖిల భారత సర్వీసు అధికారులు లేనప్పుడు ఇలాంటి నిర్ణయాలు సమంజసం కాదన్నారు.

‘ఇన్ని చిక్కుల్లో ఇప్పుడే కొత్త జిల్లాలు వద్దు. మరీ అవసర మని భావిస్తే... ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా కొత్త జిల్లాలు చేయండి. శరవేగంగా జిల్లా సమీకృత సచివాలయ సముదాయాలు నిర్మించండి. ఆ తరువాత మిగతావి’ అని లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement