జాతీయవాదమంటే నాజీయిజమే | Nationalism has connotations of Nazism in present times: BJP MP Tarun Vijay | Sakshi
Sakshi News home page

జాతీయవాదమంటే నాజీయిజమే

Oct 13 2016 2:07 AM | Updated on Mar 29 2019 8:33 PM

జాతీయవాదమంటే నాజీయిజమే - Sakshi

జాతీయవాదమంటే నాజీయిజమే

జాతీయవాదం పై ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్ బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో జాతీయవాదమంటే నాజీయిజమేనన్నారు.

బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ సంచలన వ్యాఖ్యలు
ఉత్తరాఖండ్: జాతీయవాదం పై ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్ బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో జాతీయవాదమంటే నాజీయిజమేనన్నారు. ఉత్తరాఖండ్‌లో మంగళవారం ‘జాతీయవాద సిద్ధాంతాలు ప్రపంచ రాజకీయాలపై వాటి పరిణామాలు’ అనే అంశంపై కుమోన్ సాహిత్య ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ సదస్సులో పలువురు వక్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ మాట్లాడుతూ..‘హిట్లర్, ముస్సోలినిలు తమ ప్రజల్లో ప్రేరేపించిన నాజీయిజం, ఫాసీజం ధోరణులే ఇప్పుడు జాతీయవాదానికి సమానార్థకంగా వాడుతున్నారన్నారు. అసలు జాతీయవాదం అనే పదమే ఖండించాల్సిన పదమన్నారు. నేనెప్పుడు జాతీయవాదం అనే పదాన్ని పలుకలేదని.. దేశ ధర్మమనే పలికాన న్నారు. సైద్ధాంతిక భావజాలం అనేది మనదేశం నుంచి వచ్చిందంటే నేను అంగీకరించను. అది పాశ్చాత్య దేశాలు, కమ్యూనిస్టు భావజాలం నుంచి వచ్చినదేన’న్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement