ప్రపంచ శాంతికి భారత్‌ సైతం | Narendra Modi Speech in 48th Edition Mann Ki Baat | Sakshi
Sakshi News home page

ప్రపంచ శాంతికి భారత్‌ సైతం : మోదీ

Sep 30 2018 1:36 PM | Updated on Oct 9 2018 4:36 PM

Narendra Modi Speech in 48th Edition Mann Ki Baat - Sakshi

దేశ సైనికుల ప్రాణాలను తీస్తున్న పాకిస్తాన్‌ ఉగ్రవాదులపై భారత సైన్యం జరిపిన మెరుపు దాడులను ఆయన గుర్తు చేశారు..

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ శాంతి కోసం భారత్‌  ఏమైన చేయడానికి సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అదే క్రమంలో దేశాభివృద్ధికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఉగ్రవాద చర్యల పట్ల మాత్రం కఠినంగానే వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. ఆదివారం మాన్‌ కీ బాత్‌ 48వ ఎడిషన్‌ కార్యక్రమంలో మోదీ పలు అంశాలపై మాట్లాడారు. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. దేశ సైనికుల ప్రాణాలను తీస్తున్న పాకిస్తాన్‌ ఉగ్రవాదులపై భారత సైన్యం జరిపిన మెరుపు దాడులను ఆయన గుర్తు చేశారు.

సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిపి రెండేళ్లు గడిచిన సందర్భంగా దేశ వ్యాప్తంగా ‘మెరుపు దాడుల’ దినోత్సవం జరుపుకున్నట్లు మోదీ తెలిపారు. పాక్‌ ఉగ్రవాదులపై భారత సైన్యం జరుపుతున్న పోరాటం అమూల్యమైనది కొనియాడారు. భారత సార్వభౌమాధికారానికి నిలువెత్తు నిదర్శనం సైనిక దళామని ఆయన వర్ణించారు. దేశ వ్యాప్తంగా త్రివిధ దళాల సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. దేశ భద్రతకు వారు చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ.. ప్రకృతి వైపరిత్యల సమయంలో వారు చేస్తున్న సాహసాలను, సేవలు మోదీ మెచ్చుకున్నారు.

వచ్చే అక్టోబర్‌ 2 ఎంతో ప్రాముఖ్యమైనదని.. మహాత్ముని 150వ జయంతి ఉత్సవాలను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకోబోతున్నట్లు మోదీ ప్రకటించారు. ఆ వేడుల్లో దేశ ప్రజలంతా పాల్గొన్నాలని మోదీ పిలుపునిచ్చారు.  25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల హక్కులను కాపాడటంలో సంస్థ కృషిని  మోదీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement