ప్రేమపెళ్లి చేసుకున్నారని.. అత్యంత అమానుషం! | MP Young Cople Forced Drinking Urine By Her Parents | Sakshi
Sakshi News home page

Aug 1 2018 6:19 PM | Updated on Oct 8 2018 3:28 PM

MP Young Cople Forced Drinking Urine By Her Parents - Sakshi

యువతి జట్టును కత్తిరించి చిత్రహింసలకు గురిచేశారు..

భోపాల్‌ : తమకు ఇష్టంలేని వివాహం చేసుకున్నారని ఓ జంటని వారి కుటుంబసభ్యులు అత్యంత అమానుషంగా అవమానపరిచారు. కుటుంబ సభ్యులకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్నందుకు వారిచేత మూత్రం తాగించిన ఘటన ఇటీవల మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. భోపాల్‌కు చెందిన ఓ గిరిజన జంట ఇంట్లో వారికి తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన బాలిక కుటుంబసభ్యులు యువకుడి కుటుంబంపై దాడి చేసి, కుల పంచాయతీ పెట్టించి రూ. 70 వేల నష్టపరిహారంగా కట్టించుకున్నారు. 

వీరి వివాహాన్ని రద్దు చేస్తున్నామని కుల పెద్దలు నిర్ణయించారు. ఇది జరిగిన మరునాడే ఆ జంట గ్రామాన్ని వదిలి రహస్యంగా గుజరాత్‌ వెళ్లారు. అక్కడ కొద్ది రోజులు గడిపిన తరువాత ఉద్యోగం దొరకకపోవడంతో సొంత గ్రామం తిరిగి వచ్చారు. అప్పటికే వారిపై తీవ్ర కోపంతో ఉన్న బాలిక తండ్రి వారు తిరిగి రావడంతో ఆగ్రహించారు. యువకుడి ఇంటికి వచ్చిన యువతి కుటుంబ సభ్యులు ఆ జంటను స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టారు. అంతేకాకుండా యువతి జట్టును కత్తిరించి చిత్రహింసలకు గురిచేశారు. అంతటితో ఆగకుండా ఇద్దరిచే మూత్రం తాగించి అమాషంగా ప్రవర్తించారు.

కుటుంబ సభ్యులకు ఇష్టంలేని వివాహం చేసుకున్నందుకు తన తండ్రి ప్రతీకారం తీర్చుకుంటున్నాడని యువతి జూలై 24న స్థానిక పోలీస్‌ స్టేషల్‌లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుపై స్పందించిన అలీరాజ్పూర్ డీఎస్పీ విపుల్‌ శ్రీవాస్తవ ఇద్దరు నింధితులను అరెస్ట్‌ చేశామని, ఘటనపై విచారణ వేగవంత చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement