వాజ్పేయి పక్కన.. ఈ చిన్నోడెవరు? | Know who is this smiling kid with vajpayee? | Sakshi
Sakshi News home page

వాజ్పేయి పక్కన.. ఈ చిన్నోడెవరు?

Oct 29 2014 2:09 PM | Updated on Oct 8 2018 5:45 PM

వాజ్పేయి పక్కన.. ఈ చిన్నోడెవరు? - Sakshi

వాజ్పేయి పక్కన.. ఈ చిన్నోడెవరు?

బీజేపీ కురువృద్ధ నేత అటల్ బిహారీ వాజ్పేయి పక్కనే ఉండి.. చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నోడు ఎవరో తెలుసా?

బీజేపీ కురువృద్ధ నేత అటల్ బిహారీ వాజ్పేయి పక్కనే ఉండి.. చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నోడు ఎవరో తెలుసా? ఇప్పుడు ఆయన చాలా పెద్దమనిషి. దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రాల్లో ఒకదానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. అవును.. ఆయన దేవేంద్ర ఫడ్నవిస్. మహారాష్ట్రకు త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్న వ్యక్తి. ఫడ్నవిస్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు చూద్దాం..

తొలినాళ్లలో ఆయన వస్త్రాలకు మోడల్గా పనిచేశారు. అయితే, అందుకు ఒక్క పైసా కూడా తీసుకోలేదు. తన స్నేహితుడి కోసం ఆయన ఈ పని చేశారు. కొన్ని నెలల పాటు ఆయన ఈ దుస్తులు వేసుకున్న ఫొటోలు నాగ్పూర్ నగరం మొత్తం  బాగా కనిపించాయి.

ఒకానొక సమయంలో లండన్ వెళ్లి న్యాయవిద్య చదవడం కోసం రాజకీయాలు వదిలేద్దామని దేవేంద్ర ఫడ్నవిస్ భావించారు. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేయాలన్నది ఆయన కల. కానీ, స్నేహితులు ఆపేయడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగారు.

దేవేంద్ర భార్య అమృత యాక్సిస్ బ్యాంకులో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం నాగ్పూర్లో పనిచేస్తున్న ఆమె.. ఇప్పుడు ముంబైకి బదిలీ చేయించుకుంటున్నారు.

ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఉండబోయే అత్యంత పిన్నవయస్కురాలిగా దేవేంద్ర ఫడ్నవిస్ కుమార్తె దివిజ రికార్డు సృష్టించబోతున్నారు. ఆమెకు ఇప్పుడు ఐదేళ్లు మాత్రమే. ఇంతకుముందు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పిన్న వయస్కురాలిగా ఉండేవారు. సీఎం నివాసంలో ప్రవేశించేసరికి ఆమె వయసు తొమ్మిదేళ్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement