మదర్‌ థెరిసా చీరకు మేధో హక్కు | intellectual right Mother Teresa's sari | Sakshi
Sakshi News home page

మదర్‌ థెరిసా చీరకు మేధో హక్కు

Jul 10 2017 3:46 AM | Updated on Sep 5 2017 3:38 PM

మదర్‌ థెరిసా చీరకు మేధో హక్కు

మదర్‌ థెరిసా చీరకు మేధో హక్కు

అందరికీ చిరపరిచితమైన నీలి అంచు తెల్ల చీర... జీవితాంతం మదర్‌ థెరిసా ధరించిన ఆ తరహా చీరకు మేధో హక్కును మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీస్‌ సొంతం చేసుకుంది.

కోల్‌కతా: అందరికీ చిరపరిచితమైన నీలి అంచు తెల్ల చీర... జీవితాంతం మదర్‌ థెరిసా ధరించిన ఆ తరహా చీరకు మేధో హక్కును మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీస్‌ సొంతం చేసుకుంది. ఏడాది క్రితమే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘ద ట్రేడ్‌ మార్క్స్‌ రిజిస్ట్రీ’  ఈ గుర్తింపును జారీ చేసిందని మేధో హక్కుల న్యాయవాది బిస్వజిత్‌ సర్కార్‌ ఆదివారం తెలిపారు.

మదర్‌ థెరిసాను పునీతగా ప్రకటించిన 2016, సెప్టెంబర్‌ 4నే మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీస్‌కు ఈ ఘనత దక్కిందని, ఆ సంస్థకు ప్రచారమంటే ఇష్టలేకపోవడంతో విషయం బయటకు రాలేదన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆ డిజైన్‌ను వ్యాపార ధోరణి కోసం వాడుతున్నారని, అలా చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ విషయం బయటపెడుతున్నామని సర్కార్‌ చెప్పారు. చీర ట్రేడ్‌మార్క్‌ ధ్రువీకరణ కోసం డిసెంబర్‌ 12, 2013న దరఖాస్తు చేసుకున్నారని, దాదాపు మూడేళ్ల పరిశీలన అనంతరం మే«ధో హక్కును కేటాయించారని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement