breaking news
intellectual right
-
సూపర్డ్రైతో రిలయన్స్ జత
న్యూఢిల్లీ: దక్షిణాసియా మేధో హక్కుల(ఐపీ ఆస్తులు) విక్రయానికి రిలయన్స్ రిటైల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూకే ఫ్యాషన్ రిటైలర్ సూపర్‌డ్రై తాజాగా పేర్కొంది. ఇందుకు భాగస్వామ్య సంస్థ(జేవీ) ద్వారా రిలయన్స్ రిటైల్ 4 కోట్ల పౌండ్లు(రూ. 402 కోట్లు) వెచి్చంచనున్నట్లు వెల్లడించింది. ప్రధానంగా స్వెట్‌షర్టులు, హుడీస్, జాకెట్స్ తదితర ఫ్యాషన్ ప్రొడక్టులను రూపొందిస్తున్న సూపర్‌డ్రై.. జేవీలో 24 శాతం వాటాను పొందనుంది. మిగిలిన 76 శాతం వాటా రిలయన్స్ రిటైల్ చేతిలో ఉంటుంది. ఒప్పందం ప్రకారం సూపర్‌డ్రై బ్రాండ్ ఐపీ ఆస్తులు కొత్తగా ఏర్పాటు చేయనున్న జేవీకి శాశ్వతంగా బదిలీకానున్నాయి. రిలయన్స్ బ్రాండ్స్ హోల్డింగ్ యూకేతో ఐపీ జేవీ ఏర్పాటుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సూపర్‌డ్రై పీఎల్సీ.. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజీకి తెలియజేసింది. తద్వారా భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో సూపర్‌డ్రై బ్రాండుసహా.. సంబంధిత ట్రేడ్‌మార్క్‌లను జేవీకి బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది. నిధుల ఆవశ్యకత: సూపర్‌డ్రై ఇటీవల హోల్‌సేల్ కస్టమర్ల నుంచి బలహీన ఆర్డర్ల కారణంగా స్టాక్ నిల్వలు, లిక్విడిటీ తదితర అంశాలలో సవాళ్లు ఎదుర్కొంటోంది. దీంతో జేవీకి తెరతీసింది. దీంతో స్థూలంగా 3.04 కోట్ల పౌండ్ల నగదు లభించనుందని అంచనా వేస్తోంది. కాగా.. తాజా ఒప్పందంతో రిలయన్స్ దక్షిణాసియాలోని మూడు దేశాలలో కార్యకలాపాలు చేపట్టనున్నట్లు సూపర్‌డ్రై తెలియజేసింది. జేవీలో సూపర్‌డ్రై వాటాను కొనసాగించడంతోపాటు.. తమ నైపుణ్యం ద్వారా బ్రాండ్ డెవలప్మెంట్, డిజైన్, మార్కెటింగ్‌లలో మద్దతిస్తుందని రిలయన్స్ బ్రాండ్స్ ఎండీ దర్శన్ మెహతా చెప్పారు. భారత్ భారీ అవకాశాల మార్కెట్‌కాగా.. రిలయన్స్‌తో పటిష్ట బంధమున్నట్లు సూపర్‌డ్రై వ్యవస్థాపకుడు, సీఈవో జూలియన్ డంకెర్టన్ పేర్కొన్నారు. -
మదర్ థెరిసా చీరకు మేధో హక్కు
కోల్‌కతా: అందరికీ చిరపరిచితమైన నీలి అంచు తెల్ల చీర... జీవితాంతం మదర్ థెరిసా ధరించిన ఆ తరహా చీరకు మేధో హక్కును మిషనరీస్ ఆఫ్ చారిటీస్ సొంతం చేసుకుంది. ఏడాది క్రితమే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘ద ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ’ ఈ గుర్తింపును జారీ చేసిందని మేధో హక్కుల న్యాయవాది బిస్వజిత్ సర్కార్ ఆదివారం తెలిపారు. మదర్ థెరిసాను పునీతగా ప్రకటించిన 2016, సెప్టెంబర్ 4నే మిషనరీస్ ఆఫ్ చారిటీస్‌కు ఈ ఘనత దక్కిందని, ఆ సంస్థకు ప్రచారమంటే ఇష్టలేకపోవడంతో విషయం బయటకు రాలేదన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆ డిజైన్‌ను వ్యాపార ధోరణి కోసం వాడుతున్నారని, అలా చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ విషయం బయటపెడుతున్నామని సర్కార్ చెప్పారు. చీర ట్రేడ్‌మార్క్ ధ్రువీకరణ కోసం డిసెంబర్ 12, 2013న దరఖాస్తు చేసుకున్నారని, దాదాపు మూడేళ్ల పరిశీలన అనంతరం మే«ధో హక్కును కేటాయించారని తెలిపారు.