డిసెంబర్‌1 నుంచి అమల్లోకి రానున్న ‘ఫాస్టాగ్‌’

FASTags Can Be Mandatory By December 1st Said By NHAI - Sakshi

టోల్‌ప్లాజా వచ్చిందంటే చాలు గంటల తరబడి నిరీక్షించాల్సిందే. అప్పటివరకు రయ్‌మంటూ సాగే వాహనాలకు టోల్‌ప్లాజాలు అడ్డుకట్టగా మారేవి. బారులు తీరిన వాహనాలకు రుసం వసూలు చేస్తూ..బోలెడు సమయం వృథా అయ్యేది. దీనికి పరిష్కారంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఈ-రుసుం చెల్లింపుతో కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. టోల్‌గేట్ల వద్ద ఛార్జీల చెల్లిపులను ఎలక్ర్టానిక్‌ పద్దతిలో జరిపేందుకు ఉద్దేశించిన ఈ విధానం డిసెంబర్‌ 1 నుంచి తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫాస్టాగ్‌ విధివిధానాలు, అసునరించాల్సిన పద్దతులేంటో తెలుసుకుందాం.

-ఫాస్టాగ్‌ కలిగిన వాహనం టోల్‌ఫ్లాజా దగ్గరకు రాగానే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడింటిఫికేషన్‌ టెక్నాలజీ ద్వారా ప్రీపెయిడ్‌ అకౌంట్‌కి చెల్లింపులు జరుగుతాయి. 
-ఫాస్టాగ్‌ ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌ను వాహనం ముందు భాగంలో విండ్‌సస్ర్కీన్‌పై అతికించాల్సి ఉంటుంది.
-ఎన్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ వంటి బ్యాంకుల ద్వారా కూడా వీటిని పొందవచ్చు.
-ఫాస్టాగ్‌ను ఒక వాహనానికి మాత్రమే వినియోగించేలా రూపొందించారు.

* టోల్‌ప్లాజా వచ్చినప్పుడు ఫాస్టాగ్‌ ఉన్న లేన్‌ను చూపుతూ కొన్ని బోర్డులు ఉంటాయి. ఆ మార్గంలోనే ఫాస్టాగ్‌ వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది.
* నిర్దేశించిన లేన్‌లో వెళ్లినప్పుడు వాహన వేగం 25-30కి మించి ఉండకూడదు. 
* అలాగే మీరు వెళ్తున్న లేన్‌లో మీ ముందున్న వాహనానికి కనీసం 10 మీటర్ల దూరం పాటించాలి.
* ఒకసారి మీ ఫాస్టాగ్‌ రీడ్‌ అయిన తర్వాత మీ వాహనం ముందుకు సాగొచ్చనే సంకేతంగా అక్కడ గ్రీన్‌ లైట్‌ వెలుగుతుంది. అప్పుడే ముందుకు వెళ్లాలి.
*  గ్రీన్‌ లైట్‌ వెలిగిన తర్వాత కూడా వాహనాన్ని ఎక్కువ సమయం అక్కడే ఉంచితే... బారియర్‌ గేట్‌ మళ్లీ పడిపోయే అవకాశం ఉంది.
* ఒకవేళ ఏదైనా కారణంతో మీ ఫాస్టాగ్‌ పనిచేయకపోతే అక్కడ ట్రాఫిక్‌ సిగ్నల్‌ ఎరుపు రంగులోకి మారుతుంది.
* అప్పుడు టోల్‌ప్లాజా సిబ్బంది తమ చేతిలో ఉన్న పరికరంతో మీ ఫాస్టాగ్‌ను స్కాన్‌ చేస్తారు. ఒకవేళ ఎలాంటి ఇబ్బందీ లేకుంటే ఆకుపచ్చ లైట్‌ వెలుగుతుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే  టోల్‌ఛార్జీని రుసుము ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top