దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
న్యూఢిల్లీ: దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ప్రమాదాల నియంత్రణకు జాతీయ రోడ్డు భద్రతా సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని సోమవారమిక్కడ జరిగిన రోడ్డు భద్రతా వారోత్సవంలో అన్నారు.
దేశంలో ఏటా ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, 1.5 లక్ష మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కారీ మాట్లాడుతూ.. ఈ ప్రమాదాల నివార ణ కోసం ప్రమాద స్థలాల్లో డిజైన్ మార్పువంటి వాటిని చేపట్టేందుకు ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో రూ.11 వేల కోట్లు ఖర్చు చేయనుందని వెల్లడించారు.