మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి టిక్కెట్ నిరాకరించి బీజేపీ గూటికి చేరారు. భింద్ నియోజకవర్గం నుంచి భగీరథ్ ప్రసాద్కు కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలోనే టిక్కెట్ కేటాయించింది.
భోపాల్: సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుండగా.. దేశ వ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా చతికిలపడుతుందని, నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వేలు చెబుతున్న తరుణంలో కాంగ్రెస్ శ్రేణులు డీలా పడుతున్నాయి.
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి టిక్కెట్ నిరాకరించి బీజేపీ గూటికి చేరారు. భింద్ నియోజకవర్గం నుంచి భగీరథ్ ప్రసాద్కు కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలోనే టిక్కెట్ కేటాయించింది. అయితే ఆయన అనూహ్యంగా బీజేపీలో చేరి కాంగ్రెస్కు షాకిచ్చారు. ఈ పరిణామం కాంగ్రెస్కు అవమానకరమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రసాద్ మాజీ ఐఏఎస్ అధికారి. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఆయన మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ నరేంద్ర సింగ్ తోమర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇక తమిళనాడులోనూ కాంగ్రెస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఆ రాష్ట్రంలో పొత్తుల మీద ఆధారపడి నెట్టుకొచ్చే కాంగ్రెస్కు.. ఈసారి మిత్రులు ఎవరూ కలసి రావడం లేదు. కేరళకు చెందిన రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారు. కర్ణాటకలో నందన్ నీలేకని పార్టీలో చేరకనే లోక్సభ టిక్కెట్ కేటాయించారు.
Congress candidate in Madhya Pradesh joins BJP
కాంగ్రెస్కో దండం.. మీ టిక్కెట్ వద్దు
Congress, Lok Sabha candidate, Madhya Pradesh, BJP
కాంగ్రెస్, లోక్సభ అభ్యర్థి, మధ్యప్రదేశ్, బీజేపీ