సీసీటీవీ ఫుటేజీ లభ్యం.. భయానకం | CCTV Caught Dying 7-Year-Old Crawl Out Of Gurgaon School Toilet: Police | Sakshi
Sakshi News home page

సీసీటీవీ ఫుటేజీ లభ్యం.. భయానకం

Sep 14 2017 9:17 AM | Updated on Sep 19 2017 4:33 PM

సీసీటీవీ ఫుటేజీ లభ్యం.. భయానకం

సీసీటీవీ ఫుటేజీ లభ్యం.. భయానకం

దేశంలో సంచలనం సృష్టించిన గుర్గావ్‌ బాలుడి హత్య కేసులో కీలక సీసీటీవీ ఫుటేజీ లభ్యం అయింది. టాయిలెట్‌కు సమీపంలో ఉన్న ఈ సీసీటీవీలో చనిపోయేముందు బాలుడి చివరి కదలికలు భయానకంగా కనిపించాయి.

న్యూఢిల్లీ : దేశంలో సంచలనం సృష్టించిన గుర్గావ్‌ బాలుడి హత్య కేసులో కీలక సీసీటీవీ ఫుటేజీ లభ్యం అయింది. టాయిలెట్‌కు సమీపంలో ఉన్న ఈ సీసీటీవీలో చనిపోయేముందు బాలుడి చివరి కదలికలు భయానకంగా కనిపించాయి. రక్తపు మడుగులో పడి కొట్టుకుంటున్న చిన్నారిని చూసి తాము సైతం చలించిపోయామని పోలీసులు వెల్లడించారు. గుర్గావ్‌లోని ర్యాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడు ప్రద్యుమన్‌ ఠాకూర్‌ దారుణ హత్యకు గురవ్వడంతో దేశం ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు కూడా ఈ హత్యపై తీవ్రంగా స్పందించింది.

ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్న పోలీసులకు సీసీటీవీ ఫుటేజీ లభ్యం అయింది. అందులో రికార్డయిన ప్రకారం తొలుత బాలుడు వాష్‌ రూమ్‌లోకి వెళ్లాడు. కొద్ది సేపయిన తర్వాత బస్సు కండక్టర్‌ అశోక్‌ కుమార్‌ అదే వాష్‌రూమ్‌లోకి వెళ్లాడు. ఆ తర్వాత అశోక్‌ బయటకు వెళ్లిపోగా.. మెడపైనా, గొంతుపైనా భారీగా కోసిన గాయాలతో ప్రద్యుమన్‌ మెల్లగా గోడపట్టుకొని పాకుతూ బయటకు వచ్చాడు. ఆ తర్వాత సరిగ్గా వాష్‌రూమ్ డోర్‌ వద్దకు కుప్పకూలి కదలిక లేకుండా పడిపోయాడు. రక్తం మడుగులోనే పడి అక్కడే ప్రాణాలు విడిచాడు. వైద్యులు కూడా ఇప్పటికే అధిక రక్తస్రావం అవడంవల్ల బాలుడు చనిపోయినట్లు తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement