ఆవుపై అత్యాచార ఘ‌ట‌న‌లో నిందితుడి అరెస్ట్ | 55 Year Old Man Held For Raping Cow In Bhopal | Sakshi
Sakshi News home page

ఆవుపై అత్యాచార ఘ‌ట‌న‌లో నిందితుడి అరెస్ట్

Jul 8 2020 3:25 PM | Updated on Jul 8 2020 4:37 PM

55 Year Old Man Held For Raping Cow In Bhopal - Sakshi

భోపాల్ :   ఆవుపై అత్యాచారం చేసిన ఘ‌ట‌న‌లో నిందితుడిని అరెస్ట్ చేసిన‌ట్లు భోపాల్ పోలీసులు తెలిపారు. అత‌నిపై సెక్ష‌న్ 377 కింద కేసు న‌మోదు చేసినట్లు పేర్కొన్నారు.  పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఈనెల 4న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ సుంద‌ర్‌న‌గ‌ర్ ప్రాంతంలోని ప‌శువుల పాడిలోకి చొర‌బ‌డి స‌బ్బీర్ అలీ అనే 55 ఏళ్ల వ్య‌క్తి ఆవుపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆవు రోద‌న‌లు విన్న ఇంటి య‌జ‌మ‌ని అక్క‌డి వెళ్లి చూడ‌గా నిందితుడు ప‌రారయ్యాడు.

దీంతో అనుమానం వ‌చ్చి సీసీటీవీ ఫుటేజి ప‌రిశీలించ‌గా ఆవుపై అత్యాచారానికి పాల్ప‌డిన దృశ్యాలు రికార్డు అయ్యాయి.  ఘటనపై అశోక్ గార్డెన్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన‌ట్లు భోపాల్ ఇన్‌చార్జి శ్రీ వాస్త‌వ అన్నారు. (తండ్రికొడుకుల మృతిపై సీబీఐ కేసులు నమోదు )


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement