క్యాన్సర్‌తో పోరాటంలో ఒక కాలు కోల్పోయినా..

11 Year Old Girl Lost Leg To Cancer And Dances In A Event In Kolkata - Sakshi

కోల్‌కతా : ఒక కాలుపై కొద్దిసేపు నిల్చోడమే కష్టం. అలాంటింది ఓ చిన్నారి తనకు ఒక కాలు లేకపోయినా.. అద్భుతమైన డ్యాన్స్‌ ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. వివరాల్లోకి వెళితే.. అంజలి అనే 11 ఏళ్ల చిన్నారి క్యాన్సర్‌తో పోరాటంలో తన ఒక కాలును కోల్పోవాల్సి వచ్చింది. అయినా తాను ఏ మాత్రం అధైర్య పడలేదు. పట్టుదలతో ముందుకు సాగింది. ఇటీవల కోల్‌కతాలో జరిగిన మెడికల్‌ కాన్ఫరెన్స్‌లో డ్యాన్స్‌ ప్రదర్శన ఇచ్చింది. శ్రేయా ఘోషల్‌ పాడిన ‘మేరే డోల్‌నా సున్‌’కు ఒక కాలుతోనే డ్యాన్స్‌ చేసి ఆశ్చర్యపరిచింది. ఆ సాంగ్‌ బీట్స్‌కు తగ్గట్టు పాస్ట్‌ బీట్‌ స్టెప్పులతో అక్కడికి వచ్చిన వారి హృదయాలను దోచుకుంది.

అంజలి డ్యాన్స్‌ ప్రదర్శన వీడియోను ఆ సమావేశానికి హాజరైన డాక్టర్‌ అర్నబ్‌ గుప్తా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంజలి ఆత్మస్థైర్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. జీవితంలో అంజలి ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పలువురు ఆకాంక్షించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top