స్వైన్ ఫ్లూ వ్యాధితో రాజస్థాన్ లో మరో 11 మంది శనివారం మృతిచెందారు.
జైపూర్: స్వైన్ ఫ్లూ వ్యాధితో రాజస్థాన్ లో మరో 11 మంది శనివారం మృతిచెందారు. దీంతో ఈ ఏడాది ప్రారంభం నుంచి రాష్ట్రంలో మృతుల సంఖ్య 153 కు చేరుకుంది. జైపూర్ లో 26 మంది, అజ్మీర్ లో 24 మంది ఈ వ్యాధి సోకడంతో మరణించారని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసుల సంఖ్య 2,167కు చేరింది.
'స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్లర్లను సంప్రదించాలని, రోగికి చికిత్స త్వరగా అందించడానికి వీలుంటుంది' అని రాష్ట్ర స్వైన్ ఫ్లూ టాస్క్ఫోర్స్ చీఫ్ అశోక్ పంగారియా అన్నారు. స్వైన్ ఫ్లూ నివారణలో వసుందర రాజే ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ప్రజల్లో అవగహన కల్పిస్తే వ్యాధి వ్యాప్తిని నియంత్రించవచ్చని ఆయన చెప్పారు.