‘ఇంటికి రా నీ పని చెప్తా’ | Twinkle Khanna Warns Akshay Kumar Come Home And I Am Going to Kill You | Sakshi
Sakshi News home page

అక్షయ్‌ని చంపేస్తానంటున్న ట్వింకిల్‌

Mar 6 2019 12:39 PM | Updated on Mar 6 2019 12:45 PM

Twinkle Khanna Warns Akshay Kumar Come Home And I Am Going to Kill You - Sakshi

‘ఇంటికి వెళ్లాలంటే భయమేస్తుంది’ అంటున్నారు బాలీవుడ్‌ ఖిలాడి హీరో అక్షయ్‌ కుమార్‌. ‘ఇంటికి రా చంపేస్తా’ అంటున్నారు ట్వింకిల్‌ ఖన్నా. అరే ఏమైంది వీళ్లిద్దరికి అని కంగారు పడకండి. అక్షయ్‌ చేసిన ఓ సాహసోపేతమైన స్టంట్‌ మూలానా వచ్చినవే ఈ వార్నింగ్‌లు, రియాక్షన్‌లు. యాక్షన్‌ హీరోగా పేరు తెచ్చుకున్న అక్షయ్‌.. తొలిసారి ‘ది ఎండ్‌’ అనే వెబ్‌ సిరిస్‌ల్‌ నటిస్తున్నారు. ఈ విషయం గురించి చెప్పడం కోసం అక్షయ్‌ ఏకంగా తన ఒంటికి నిప్పంటించుకుని స్టేజ్‌ మీదకు వచ్చారు. ఈ స్టంట్‌ చూసిన అక్షయ్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా.. ‘నీ ఒంటికి నువ్వే నిప్పంటించుకున్నావా.. ఇంటికి రా.. నిన్ను చంపేస్తాను. ఒకవేళ నువ్వు బతికి ఉంటే దేవుడా నాకు సాయం చెయ్యి’ అంటూ ట్వీట్‌ చేశారు.

దీనికి బదులుగా అక్షయ్‌ ‘ఇంటికి వెళ్లాలంటే భయంగా ఉంది. ట్వింకిల్‌ నాకు ఎలాంటి శిక్ష వేస్తుందో’ అంటూ రీట్వీట్‌ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి ట్విటర్‌ సంభాషణ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ సాహసోపేతమైన స్టంట్‌ గురించి అక్షయ్‌ మాట్లాడుతూ.. ‘యాక్షన్‌ నా రక్తంలోనే ఉంది. ముందు నేను స్టంట్‌మ్యాన్‌ని. ఆ తర్వాతే యాక్టర్‌ని’ అని తెలిపారు. అయితే తాను చేయబోయే వెబ్‌సిరీస్‌ షో గురించి మాత్రం ఎక్కువ వివరాలను వెల్లడించలేదు అక్షయ్‌. తన కుమారుడు ఆరవ్‌ సూచన మేరకు ఈ వెబ్‌సిరీస్‌లో నటించడానికి ఒప్పుకొన్నట్లు పేర్కొన్నారు. ఈ వెబ్‌ సిరీస్‌తో పాటు అక్షయ్‌ ‘కేసరి’, ‘సూర్యవంశి’ చిత్రాలతోనూ బిజీగా ఉన్నారు. మార్చి 21న ‘కేసరి’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement