‘విద్యార్థులకంటే ఆవులకే ఎక్కువ రక్షణ ఉంది’

Twinkle Khanna: India where Cows Seem To Receive More Protection Than Students - Sakshi

ముంబై : బాలీవుడ్‌ నటి, అక్షయ్‌ కుమార్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా సోషల్‌ మీడియలో చురుగ్గా ఉంటూ.. సమకాలిన విషయాలపై స్పందిస్తారనే విషయం తెలిసిందే. తాజాగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నెలకొంటున్న ఆందోళనలపై ఆమె స్పందించారు. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో(జేఎన్‌యూ) ఆదివారం దుండగులు ముసుగులు ధరించి విద్యార్థులపై దాడిచేయగా.. తీవ్ర గాయాలపాలైన విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ క్రమంలో ట్వింకిల్‌ ఖన్నా ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. దేశంలో విద్యార్థుల కంటే ఆవులకే ఎక్కువ రక్షణ ఉన్నట్లు ఉందని ట్వింకిల్‌ ఖన్నా వ్యాఖ్యానించారు. భయపడుతూ బతకాలని ఎవరూ అనుకోవడం లేదని, హింసతో ప్రజలను అణచి వేయలేరని పేర్కొ‍న్నారు. అలా చేయడం వల్ల నిరసనలు, ఆందోళనలు మరింత పెరుగుతాయని.. ఎక్కువ మంది రోడ్లపైకి వస్తారని ట్వింకిల్‌ ఖన్నా తెలిపారు. (ఈరోజు నా కూతురు.. రేపు మీపై కూడా..)

జేఎన్‌యూలో దాడిని ఖండించిన బాలీవుడ్‌ తారలు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top