‘నటిగా, మహిళగా ఆమె అందరికీ ఆదర్శం’

Tollywood actors tweets after Sridevis death - Sakshi

ప్రముఖ నటి శ్రీదేవి మరణం సినీరంగానికి షాక్‌ ఇచ్చింది. ఊహించని ఈ సంఘటనపై టాలీవుడ్ తారలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘శ్రీదేవి మరణ వార్తతో షాక్‌ అయ్యాను. ఓ నటిగా, ఓ మహిళగా ఆమె అందరికీ ఆదర్శం. ఎప్పటికీ ఆమే నా అభిమాన నటి. ఆమె ఆత్మకు చేకూరాలని కోరుకుంటున్నా’అంటూ ట్వీట్ చేశారు. ‘ఇప్పటికే ఈ వార్త నమ్మలేకపోతున్నా.. నిజంగా సినీ పరిశ్రమకు తీరనిలోటు’ అన్నారు రవితేజ.

దర్శకధీరుడు రాజమౌళి ‘ఈ వార్త విని షాక్‌ అయ్యాను. తొలి లేడీ సూపర్‌ స్టార్‌. 54 నాలుగేళ్ల జీవితంలో యాబై ఏళ్లు నటిగా కొనసాగిన ప్రస్థానం. ఇలా ముగిసింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలి’ అని ట్వీట్ చేశారు. హీరోలు అల్లు అర్జున్‌, రానా దగ్గుబాటి, సుధీర్‌ బాబు, అధర్వ, రాహుల్ రవీంద్రన్‌, గౌతమ్‌ కార్తీక్‌లతో పాటు హీరోయిన్లు కాజల్ అగర్వాల్, ప్రగ్యా జైస్వాల్‌ శ్రీయ రెడ్డి, పరుల్ యాదవ్, ఐశ్వర్య రాజేష్‌లు తమ సంతాపాన్ని తెలియజేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top