'ఆ హీరోతో నాకు విభేదాల్లేవు' | There has never been any problem with Shahid: Saif Ali Khan | Sakshi
Sakshi News home page

'ఆ హీరోతో నాకు విభేదాల్లేవు'

Sep 1 2015 4:55 PM | Updated on Sep 3 2017 8:33 AM

'ఆ హీరోతో నాకు విభేదాల్లేవు'

'ఆ హీరోతో నాకు విభేదాల్లేవు'

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్తో తనకెలాంటి విబేధాలూ లేవని మరో హీరో సైఫ్ అలీఖాన్ స్పష్టం చేశారు.

ముంబై: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్తో తనకెలాంటి విభేదాలూ లేవని  మరో హీరో సైఫ్ అలీఖాన్ స్పష్టం చేశారు. తమ మధ్య సమస్యలు ఉంటే, కలసి పనిచేయడానికి అంగీకరించేవాళ్లం కాదని సైఫ్ చెప్పారు. ఈ హీరోలు ఇద్దరూ ఇటీవల ఓ రియాల్టీ టీవీ షోలో పాల్గొన్నారు.

'షాహిద్తో నాకు శత్రుత్వం ఎందుకు ఉండాలి? గతంలో ఏదో జరిగింది. దాని గురించి జనం  ఏవేవో మాట్లాడుకోవడం ఎందుకు?  షాహిద్ ఎప్పుడూ హుందాగా ఉంటారు. అందరూ అనుకుంటున్నట్టుగా మా మధ్య నిజంగా విబేధాలు లేవు' అని సైఫ్ చెప్పారు. గతంలో కరీనా, షాహిద్ డేటింగ్ చేశారు. ఈ నేపథ్యంలో సైఫ్ పైవిధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement