ప్రియాంకనే కాదు.. కత్రినాను కూడా అవమానించారు

Sona Mohapatra Slams Salman Khan Dig at Priyanka Chopra - Sakshi

సల్మాన్‌ ఖాన్‌ తాజా చిత్రం భారత్‌. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు సల్మాన్‌. అయితే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం నుంచి సల్మాన్‌.. ప్రియాంక చోప్రా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే తొలుత ఈ సినిమాలో ప్రియాంకను హీరోయిన్‌గా తీసుకున్నారు. కానీ నిక్‌ జోనాస్‌తో వివాహం కారణంగా ప్రియాంక చివరి నిమిషంలో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. తరువాత ప్రియాంక స్థానంలో కత్రినాను తీసుకున్నారు. కానీ ఈ విషయంలో సందర్భం దొరికితే చాలు సల్మాన్‌.. ప్రియాంకపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా మరోసారి ప్రియాంక మీద మండి పడ్డారు సల్మాన్‌. తన జీవితంలోనే అతి పెద్ద చిత్రం నుంచి ప్రియాంక తప్పుకున్నారు. పెళ్లి చేసుకున్నారు అంటూ విమర్శించారు.

ఈ విమర్శలపై బాలీవుడ్‌ సింగర్‌ సోనా మహాపాత్ర స్పందించారు. ప్రియాంక తన జీవితంలో ఉత్తమైన వాటి కోసం సమయం కేటాయించారు. ఆమె ప్రయాణం ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తుంది. కానీ సల్మాన్‌ ఈ విషయం అర్థం చేసుకోకుండా.. ఆమెపై విమర్శలు చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా సల్మాన్‌ కేవలం ప్రియాంకను మాత్రమే కాదు పక్కనే ఉన్న కత్రినాను కూడా అవమానించినట్లే. అయిన తన ఎదురుగా లేని ఓ మనిషి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మర్యాద అనిపించుకోదు’ అంటూ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు మహాపాత్ర. ఇక పోతే ‘భారత్‌’ చిత్రం ఈ రంజాన్‌ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top