మామిడికాయ పప్పు ఎంతో ఇష్టం

Shruti Haasan Cooks Hyderabad Mango Pappu Recipe - Sakshi

దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఇక కొంతమంది వంట చేయటం నేర్చుకుంటూ అందులో ప్రావిణ్యం సంపాదిస్తున్నారు. మరికొంత మంది రకరకాల వెరైటీ వంటలు ట్రై చేస్తూ కుటుంబ సభ్యులను సంతోషపెడుతున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వృత్తి, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకునే సినీ సెలబ్రిటీల్లో హీరోయిన్‌  శృతి హాసన్ ముందు వరసలో ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా శృతి హాసన్‌ తనకు ఎంతో  ఇష్టమైన హైదరాబాద్‌ తెలుగు వంటకం ‘మామిడికాయ పప్పు’ను చేశారు. (తారక్‌కు బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌‌ స్పెషల్‌ విషెస్‌..)

అదేవిధంగా తాను స్వయంగా చేసిన ‘మామిడికాయ పప్పు’ వీడియాను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు శృతి హాసన్‌.  ‘చాలా సులభంగా చేసే మామిడికాయ పప్పు నాకు చాలా ఇష్టం. నేను చిన్నతనంలో హైదరాబాద్‌కి మొదటిసారి వచ్చినప్పుడు ఈ మామిడికాయ పప్పును తిన్నాను. ఇక ఈ వంట చేయటం చాలా సులభం. మీ రుచికి తగినట్లు మసాలా వేస్తే చాలా బాగుంటుంది. నేను మాత్రం చాలా తక్కువగా మసాలాను వేస్తాను. ఎందుకంటే సహజమైన మామిడికాయ రుచిని ఆస్వాదించాలి’ అంటూ కామెంట్‌ జత చేశారు శృతి హాసన్‌. ఇక తాను లాక్‌డౌన్‌ సమయంలో సెల్ఫ్‌ క్వారంటైన్‌లో భాగంగా ఇంటికే పరిమితయ్యారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్‌’ చిత్రంలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ వల్ల ఈ సినిమా షూటింగ్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది.    

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top