మీకు రుణపడి ఉంటాను : శర్వానంద్ | Sharwanand To Get Back To The Sets | Sakshi
Sakshi News home page

మీకు రుణపడి ఉంటాను : శర్వానంద్

Jun 29 2019 2:32 PM | Updated on Jun 29 2019 4:17 PM

Sharwanand To Get Back To The Sets - Sakshi

యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. 96 సినిమా రీమేక్‌ కోసం స్కై డైవింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో శర్వా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో శర్వా భుజం ఎముక ఫ్యాక్చర్‌ అయింది. వెంటనే శర్వాను హైదరాబాద్‌లోని సన్‌షైన్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు.

డాక్టర్లు గురవారెడ్డి, ఆదర్శ్‌లు శర్వానంద్‌కు చికిత్స అందించారు. అభిమానుల కోసం చికిత్సకు సంబంధించి డాక్టర్‌  ఓ వీడియో మేసేజ్‌ను కూడా రిలీజ్ చేశారు. గాయం నుంచి త్వరగా కోలుకుంటున్న శర్వానంద్ తనకు ట్రీట్‌మెంట్ అందించిన సన్‌షైన్‌ హాస్పిటల్‌ వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కుటుంబ సభ్యులు, డాక్టర్‌ గురువారెడ్డి, డాక్టర్‌ ఆదర్శ్‌లతో కలిసి దిగిన ఫోటోను ట్వీట్‌ చేసిన శర్వా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. ప్రస్తుతం శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన రణరంగం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుండగా 96 రీమేక్‌ త్వరలో పట్టాలెక్కనుంది.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement