'అప్పుడు రిటైర్ అవుతా..' : షారూఖ్ | sharukh khan waiting for national award | Sakshi
Sakshi News home page

'అప్పుడు రిటైర్ అవుతా..' : షారూఖ్

Jan 1 2016 4:19 PM | Updated on Sep 3 2017 2:55 PM

'అప్పుడు రిటైర్ అవుతా..' : షారూఖ్

'అప్పుడు రిటైర్ అవుతా..' : షారూఖ్

ఇటీవల దిల్ వాలే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మరో ఇంట్రస్టింగ్ సినిమాలో నటిస్తున్నాడు. ఫ్యాన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫిలిం...

ఇటీవల దిల్ వాలే సినిమాతో ఆడియన్స్  ముందుకు వచ్చిన బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మరో ఇంట్రస్టింగ్ సినిమాలో నటిస్తున్నాడు. ఫ్యాన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫిలిం స్టార్ పాత్రతో పాటు మానసికవైకళ్యంతో ఇబ్బంది పడుతున్న అతని అభిమాని పాత్రలో కూడా నటిస్తున్నాడు షారూక్. ఈ పాత్రలో 24 ఏళ్ల అబ్బాయిగా కనిపించటం కోసం ప్రొస్థేటిక్ మేకప్తో నటిస్తున్నాడు. ఈ క్యారెక్టర్ షూటింగ్ సమయంలో రోజుకు దాదాపు నాలుగు గంటల సమయం కేవలం మేకప్ పడుతుందని, మేకప్ వేసుకున్న తరువాత ఆ మేకప్ను మెయిన్టైన్ చేయిటం కూడా చాలా కష్టమని తెలిపాడు.

ప్రస్తుతం షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్న ఈ సినిమాను 2016 ఏప్రిల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో నటనకు అవార్డ్లు ఆశిస్తున్న షారూఖ్ తన రిటైర్మెంట్ మై ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. ఇన్నేళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో పురస్కారాలు అందుకున్న బాద్ షా నేషనల్ వార్డ్ మాత్రం సాధించలేకపోయాడు. అందుకే ఒక్క నేషనల్ అవార్డ్ సాధించిన తరువాత రిటైర్ అవుతానన్నాడు. ప్రస్తుతానికి షారూక్ సరదాగానే ఈ కామెంట్ చేసినా, షారూఖ్ టార్గెట్ మాత్రం నేషనల్ అవార్టే అంటున్నారు సినీజనాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement