నిన్నెంత ప్రేమిస్తున్నానో తెలుసా: సాయి పల్లవి | Sai Pallavi Shares Photo And Emotional Note On Her Sister Birthday | Sakshi
Sakshi News home page

నిన్నెంతగా ప్రేమిస్తున్నానో తెలుసా: సాయి పల్లవి

Apr 22 2020 2:27 PM | Updated on Apr 22 2020 2:40 PM

Sai Pallavi Shares Photo And Emotional Note On Her Sister Birthday - Sakshi

‘‘నువ్వు చేసిన త్యాగాలు.. రాజీపడ్డ అంశాలను రహస్యంగా ఉంచిన తీరు.. నీ ప్రేమ.. నా జీవితానికి నువ్విచ్చిన అర్థం.. నాలో నువ్వు నింపిన సంతోషం.. ఎల్లవేళలా చిరునవ్వు చిందించే నువ్వు.. నీ ఉనికి నా ప్రపంచాన్ని గొప్పగా మార్చింది. 100 ఏళ్లు వచ్చినా నువ్వు నా బేబీవే. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలియాలంటే నువ్వు నాలా మారిపోవాల్సిందే. నా జీవితంలో నువ్వు ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. హ్యాపీ బర్త్‌ డే మంకీ’’ అంటూ హీరోయిన్‌ సాయిపల్లవి తన సోదరి పూజా కన్నన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం పూజా పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో చిన్ననాటి ఫొటో షేర్‌ చేసి తన ప్రేమను చాటుకున్నారు.

కాగా ఫిదాతో కుర్రకారు మనసు దోచిన సాయి పల్లవి ప్రస్తుతం.. ‘లవ్‌స్టోరీ’అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడింది. ఇక ఈ చిత్రంతో పాటు రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో రూపొందిన ‘విరాటపర్వం’లోనూ సాయి పల్లవి నటిస్తున్నారు. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్‌ వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా వేసవిలోనే విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement