వైరస్‌ వస్తే? | Ram Gopal Varma announces 'Virus' | Sakshi
Sakshi News home page

వైరస్‌ వస్తే?

Jun 11 2018 1:12 AM | Updated on Jun 11 2018 1:12 AM

Ram Gopal Varma announces 'Virus' - Sakshi

రామ్‌గోపాల్‌ వర్మ

పెరిగిన జనాభా, రోజు రోజుకి పెరిగిపోతున్న కాలుష్యంతో కొత్త కొత్త వైరస్‌లు వస్తున్నాయి.  ఒకవేళ మందు దొరకని వింత వైరస్‌ ముంబై మహానగరాన్ని ముంచేస్తే? అనే కాన్సెప్ట్‌తోనే తన తదుపరి చిత్రం ‘వైరస్‌’ని రూపొందించనున్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ‘సర్కార్, ది అటాక్స్‌ ఆఫ్‌ 26/11’ చిత్రాలను నిర్మించిన పరాగ్‌ సాంగ్వీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

కొత్త ప్రాజెక్ట్‌ గురించి వర్మ మాట్లాడుతూ – ‘‘ఆఫ్రికా నుంచి వ్యాపించిన అరుదైన వైరస్‌ ముంబైలో పెను ముప్పులా తయారైనప్పుడు ఆ వ్యాధి మిగతా రాష్ట్రాలకు వ్యాపించొద్దనే ఉద్దేశంతో గవర్నమెంట్‌ ముంబైని దేశం నుంచి కట్‌ చేస్తుంది. ఈ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేమ, బాధ, నిస్సహాయత, ఆశ వంటి ఎమోషన్స్‌ ఈ చిత్రంలో చూపించదలిచాం’’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement